Latest Updates
-
పౌర్ణమి వేళ అరుదైన సిద్ధ యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధనయోగం పక్కా! -
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆప్రికాట్ నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? -
సూర్య నమస్కారం చేసేటప్పుడు ఈ 12 మంత్రాలు చదివితే ఫలితం రెట్టింపు అవుతుంది -
పౌర్ణమి వేళ గ్రహాల యుద్ధం: వృశ్చిక రాశిలో చంద్రుడు, మీన రాశిలో శని.. ఈ రాశుల వారికి ఇక కష్టాలేనా? -
వృషభం, సింహం, వృశ్చిక రాశుల వారికి ఆదివారం అద్భుత యోగం..! - ఆదివారం, 31 మే 2026 -
ఈ వారం ఈ 4 రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - 31 మే నుండి 06 జూన్ 2026 వరకు -
బ్లూ మైక్రోమూన్తో ఆకాశంలో అద్భుతం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే.? -
మీ అమ్మాయి టీనేజ్ లో అడుగుపెడుతోందా? అయితే ఈ 4 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి.. -
చామదుంపలతో ఇలా చేస్తే మటన్, చికెన్ చాప్స్ కూడా దేనికీ పనికిరావు! -
మీరు రోజూ చేసే ఈ 5 చిన్న పనులే మీ బంధాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి
వీకెండ్ స్పెషల్స్.. చికెన్‌తో ఇలా స్నాక్స్ చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
సండే వచ్చిందంటే ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇక పిల్లలైతే స్నాక్స్‌లో ఎప్పుడూ బజ్జీలు, పునుగులేనా అంటూ ముఖం మాడ్చేస్తారు. అందుకే ఈ ఆదివారం చిన్నాపెద్దా అందరూ ఇష్టంగా తినేలా నూనె ఎక్కువగా లేకుండా ఇలా చికెన్‌తో స్నాక్స్ చేసి చూడండి.. ఇక జంక్ ఫుడ్ జోలికే వెళ్లరు. చికెన్ వింగ్స్ సాయంత్రం స్నాక్స్‌లో బెటర్ ఛాయిస్. వీటిని రెండు రకాలుగా చేసుకోవచ్చు. కారంగా తినేవారికి ఒక విధానంలో, పిల్లల కోసం కొంచెం స్వీట్‌గా నచ్చిన రీతిలో చేసుకోవచ్చు. హాట్ చికెన్ వింగ్స్, స్వీట్ చిల్లీ చికెన్ వింగ్స్‌ను సింపుల్‌గా మన తెలుగింటి స్టైల్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

హాట్ చికెన్ వింగ్స్‌కి కావాల్సిన
పదార్థాలు
చికెన్- అరకేజీ(చూపుడు వేలు సైజులో కట్
చేసుకోవాలి)
వెనిగర్- టీస్పూన్
కారం- టీ స్పూన్
కార్న్ ఫ్లోర్- అర కప్పు
తెల్ల, నల్ల మిరియాల పొడి- టీ స్పూన్
బేకింగ్ పౌడర్- టీస్పూన్
నూనె- టీ స్పూన్
తయారీ విధానం
-చికెన్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుని అందులో వెనిగర్, కారం, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, సరిపడా ఉప్పు, బేకింగ్ పౌడర్, నూనె వేసి బాగా కలపాలి. మూతపెట్టి ఓ పదిహేను నిమిషాల పాటు మారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను ఓ అరగంట పాటు మైక్రో ఓవెన్లో పెట్టాలి. అంతే కారంకారంగా చికెన్ వింగ్స్ రెడీ. వీటిని మామూలుగా తినవచ్చు. లేదా పెరుగుతో సర్వ్ చేసుకున్నా టేస్టీగా ఉంటుంది.
స్వీట్ చిల్లీ చికెన్ వింగ్స్‌కి కావాల్సిన పదార్థాలు
చికెన్- అరకేజీ
సోయా సాస్- రెండు టీ స్పూన్లు
ఓయ్స్టర్ సాస్-
టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీ
స్పూన్
కార్న్ ఫ్లోర్- అరకప్పు
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ- ఒకటి
ఉల్లికాడలు- పది
వెల్లుల్లి రెబ్బలు- 20
రెడ్ మిర్చి- ఆరు
తేనె- టీ స్పూన్
-శుభ్రంగా కడిగిన చికెన్‌ను ఓ గిన్నెలోకి తీసుకుని సోయా సాస్, ఓయ్స్టర్ సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్ నూనె వేసి బాగా కలిపి పదినిమిషాల పాటు మారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో కొద్దిగా నూనె వేసి చికెన్ ముక్కలను ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే బాణలిలో కట్ చేసిన రెడ్
మిర్చి, ఉల్లికాడలు, వెల్లుల్లిని వేసి వేయించుకోవాలి. కాసేపు వేగాక
సోయాసాస్, తేనె, ఉల్లిపాయ ముక్కలు వేసి మొత్తం ఒకసారి
కలపాలి. కాసేపు వేగాక ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసి
కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అవసరమైతే చివర్లో
కొద్దిగా నువ్వులు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే టేస్టీ స్వీట్ చిల్లీ
చికెన్ వింగ్స్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications