Latest Updates
-
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు
సొరకాయ వద్దనే పిల్లలు కూడా ప్లేట్ ఖాళీ చేసే సొరకాయ పకోడీ.. తయారీ ఇలా!
సాధారణంగా మనం ఉల్లిపాయ లేదా బంగాళదుంప పకోడాలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి కాస్త భిన్నంగా, రుచికరంగా,ఆరోగ్యకరంగా ఉండే సొరకాయ పకోడీ ట్రై చేయండి. సొరకాయ కూర అంటే ఇష్టపడని వారు, ముఖ్యంగా పిల్లలు కూడా ఈ పకోడాలను లొట్టలేసుకుంటూ తింటారు. పైన కరకరలాడుతూ, లోపల మృదువుగా ఉండే ఈ సొరకాయ పకోడాలను మీ ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

సొరకాయ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత సొరకాయ - 1 (మధ్యస్థ పరిమాణంలో)
శనగపిండి - 1 కప్పు
బియ్యప్పిండి లేదా బొంబాయి రవ్వ - 2 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 2 లేదా 3
కారం - 1 టీస్పూన్, పసుపు - అర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర, సోంపు, వాము - అర టీస్పూన్ చొప్పున
సన్నగా తరిగిన కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
సొరకాయ పకోడీ తయారీ విధానం
-ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి, రెండు వైపులా ఉన్న తొడిమలను కత్తిరించి పైన తొక్కను పూర్తిగా చెక్కుకోవాలి. ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి సొరకాయను సన్నగా తురుముకోవచ్చు లేదా గుండ్రని పలుచని ముక్కలుగా కోసుకోవచ్చు.
-ఇప్పుడు ఒక చిన్న చిట్కా పాటిస్తే పకోడాలు మరింత రుచిగా వస్తాయి. తురిమిన లేదా ముక్కలుగా కోసిన సొరకాయను కొద్దిగా ఉప్పు కలిపిన నీటిలో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల సొరకాయలోని పచ్చిదనం పోయి, రుచి అద్భుతంగా వస్తుంది.
-5 నిమిషాల తర్వాత నీటిలో నుండి సొరకాయను తీసి, అదనపు నీరు పూర్తిగా వడిచిపోవడానికి ఒక జల్లెడలో వేసి 2 నిమిషాలు పక్కన పెట్టండి. ఇందులో నీరు ఎక్కువగా ఉంటే పిండి పల్చబడిపోయి పకోడాలు సరిగ్గా రావు.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో శనగపిండి, బియ్యప్పిండి (లేదా రవ్వ) వేసి కలపాలి. బియ్యప్పిండి వేయడం వల్ల పకోడాలు నూనె పీల్చకుండా మంచి క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, వాము, సోంపు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలాలన్నీ పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నీరు వడకట్టి పెట్టుకున్న సొరకాయ వేసి కలపాలి. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పకోడా పిండిలా గట్టిగా కలుపుకోవాలి. చిక్కగా కలుపుకోండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఉండలు లేకుండా కలుపుకుంటే పిండి వేయించడానికి రెడీ.
-స్టవ్ వెలిగించి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత, కలుపుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడాలుగా నూనెలో నెమ్మదిగా జారవిడవండి. పకోడాలు రెండు వైపులా సమానంగా ఉడికేలా గరిటెతో అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. ఇవి మంచి బంగారు గోధుమ రంగులోకి మారి, కరకరలాడేంత వరకు వేయించాలి.
-అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి సొరకాయ పకోడాలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
