Latest Updates
-
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి..
అప్పటికప్పుడు సులువుగా చేసుకొనే మామిడికాయ పచ్చడి.. 3 నెలలు నిల్వ ఉంటది!
వేడి వేడి అన్నంలో కాస్త కమ్మటి నెయ్యి వేసుకుని, కారంగా, పుల్లగా ఉండే మామిడికాయ పచ్చడి కలుపుకుని తింటే ఆ మజానే వేరు. మామిడికాయల సీజన్ రాగానే ప్రతి తెలుగువారి ఇంటా పచ్చళ్ళ సందడి మొదలవుతుంది.
అయితే ఎంతో శ్రమతో, రోజుల తరబడి పెట్టుకునే ఆవకాయ కాకుండా అప్పటికప్పుడు చాలా సులువుగా, అద్భుతమైన రుచితో తయారు చేసుకోగలిగే ఇన్ స్టంట్ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో ఇక్కడ చూడండి. ఈ పచ్చడి చేయడం చాలా తేలిక, పైగా ఎలాంటి పాడవుతుందనే భయం లేకుండా రెండు నుంచి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది.

ఇన్ స్టంట్ మామిడికాయ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
పుల్లటి మామిడికాయలు: 5 లేదా 6
కారం: 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు: 3 టేబుల్ స్పూన్లు (మీ రుచికి తగినంత)
ఆవ పిండి: 3 టీస్పూన్లు (ఆవాలను వేయించకుండా మెత్తగా పొడి
చేసుకోవాలి)
జీలకర్ర,మెంతుల పొడి: ఒకటిన్నర టీస్పూన్ (1 టీస్పూన్ జీలకర్ర, అర
టీస్పూన్ మెంతులను దోరగా వేయించి పొడి చేయాలి)
వెల్లుల్లి: 2 పాయలు
నూనె: తగినంత
ఆవాలు: 1 టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
ఎండుమిర్చి గింజలు: 1 టీస్పూన్
ఎండుమిరపకాయలు: 2 లేదా 3
కరివేపాకు: 2 రెమ్మలు
పసుపు: అర టీస్పూన్
ఇన్ స్టంట్ మామిడికాయ పచ్చడి తయారీ విధానం
-ముందుగా 5-6 మామిడికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పొడి బట్టతో తుడవాలి. మీకు కావలసిన సైజులో ముక్కలుగా కోసుకుని, వాటిని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలి. తడి తగిలితే పచ్చడి పాడవుతుంది కాబట్టి బౌల్ కూడా పొడిగా ఉండేలా చూసుకోండి.
-మామిడికాయ ముక్కలలో 4 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేయాలి. అందులోనే వేయించకుండా పొడి చేసుకున్న 3 టీస్పూన్ల ఆవపిండిని కలపాలి. తర్వాత, ముందుగా దోరగా వేయించి పెట్టుకున్న జీలకర్ర-మెంతుల పొడిని వేయాలి. ఈ పొడి పచ్చడికి చక్కటి సువాసనను ఇస్తుంది. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేసి, ముక్కలన్నింటికీ ఈ మసాలాలు బాగా పట్టేలా గరిటతో లేదా చేత్తో బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, మందపాటి కడాయిలో పచ్చడికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక అందులో 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. దీనిలో 1 టీస్పూన్ ఎండుమిర్చి గింజలు వేయాలి. ఆ తర్వాత 2-3 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
-ఈ పోపును కాస్త చల్లారనిచ్చి, ముందుగా మసాలాలు కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల మిశ్రమంలో పోసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-అంతే ఘుమఘుమలాడే మామిడికాయ పచ్చడి రెడీ. ఇది తయారైన వెంటనే తినొచ్చు లేదా ఒక రోజు ఊరనిస్తే రుచి రెట్టింపు అవుతుంది. దీన్ని ఒక గాలి చొరబడని పొడిగా ఉన్న గాజు సీసాలో భద్రపరుచుకుంటే 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
