Latest Updates
-
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్!
ప్రెషర్ కుక్కర్.. పప్పు, అన్నం, కూరగాయలు లాంటివి త్వరగా,సులభంగా వండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కుక్కర్ వల్ల వంట సమయంతో పాటు గ్యాస్ కూడా ఆదా అవుతుంది. అయితే కొన్నిసార్లు కుక్కర్ విజిల్ రాకముందే మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవ్వడం మనం గమనిస్తుంటాం.
విజిల్ రాకపోవడం వల్ల లోపల ఆహారం ఉడికిందో లేదో అర్థం కాక గృహిణులు కంగారు పడుతుంటారు. మీ కుక్కర్ నుండి ఆవిరి లీక్ అవుతుంటే, 4 సులభమైన చిట్కాలను పాటించి సమస్యను పరిష్కరించుకోవచ్చు.

రబ్బరు గాస్కెట్ తనిఖీ చేయండి
కుక్కర్ లోపల ఆవిరి బయటకు పోకుండా బంధించి ఉంచడంలో మూతకు ఉండే రబ్బరు గాస్కెట్ (రబ్బరు రింగ్) పాత్ర చాలా కీలకం. వంట ప్రారంభించే ముందు రబ్బరును ఒకసారి పరిశీలించండి. రోజువారీ వాడకం వల్ల కాలక్రమేణా రబ్బరు సాగిపోవడం, వదులుగా మారడం లేదా తెగిపోవడం జరుగుతుంది. గాస్కెట్ సరిగ్గా అమరకపోయినా లేదా పాడైపోయినా మూత అంచుల గుండా ఆవిరి సులభంగా లీక్ అవుతుంది.
కాబట్టి మీ కుక్కర్ రబ్బరు పాతదైనా, దెబ్బతిన్నా వెంటనే దాన్ని తీసివేసి, మీ కుక్కర్ మోడల్ కు సరిపోయే సరైన కొత్త గాస్కెట్ ను అమర్చండి. రబ్బరును మూతకు సరిగ్గా బిగించిన తర్వాత మాత్రమే కుక్కర్ ను మూసి వంటకు సిద్ధం చేయాలి.
మూత సరిగ్గా మూసి ఉందో లేదో చూసుకోండి
హడావిడిగా వంట చేసే సమయంలో చాలామంది కుక్కర్ మూతను సరిగ్గా గమనించకుండా వేస్తుంటారు. మూత సరిగ్గా లాక్ చేయకపోతే, లోపల తయారయ్యే ఒత్తిడి బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల కుక్కర్ విజిల్ రావడంలో సమస్య ఏర్పడవచ్చు. అందువల్ల కుక్కర్ ను ఉపయోగించే ముందే, మూత అంచులు బాడీకి సమానంగా కూర్చున్నాయో లేదో చూసుకుని, సరిగ్గా లాక్ చేయండి. ఒకవేళ మూత బిగుతుగా అనిపించినా లేదా వంకరగా ఉన్నా దాన్ని బలవంతంగా మూయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకండి.
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే..
విజిల్, స్టీమ్ వెంట్ శుభ్రత
పప్పు లేదా అన్నం వండేటప్పుడు పొంగి, ఆ కణాలు కుక్కర్ మూత పైభాగంలో ఉండే ఆవిరి రంధ్రం లేదా విజిల్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. మురికి లేదా ఆహారపు వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల ఆవిరి బయటకు వెళ్లడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ఇది కుక్కర్ లోపల ప్రెషర్ పెరిగే విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
కాబట్టి ప్రతి ఉపయోగం తర్వాత మూతను, విజిల్ ను ,ఆవిరి రంధ్రాన్ని క్షుణ్ణంగా శుభ్రం చేసుకోవాలి. వెంటిలేటర్ మూసుకుపోయినట్లయితే ముందుగా దాన్ని శుభ్రం చేయాలి. కుక్కర్ వేడిగా ఉన్నప్పుడు లేదా లోపల ప్రెషర్ ఉన్నప్పుడు విజిల్ను తీయడం లేదా శుభ్రం చేయడం లాంటివి ఎప్పుడూ చేయకూడదు.
కుక్కర్ ను పరిమితికి మించి నింపకండి
కుక్కర్ లో అవసరానికి మించి ఎక్కువగా బియ్యం, పప్పులు లేదా ఇతర పదార్థాలను నింపడం వల్ల లోపల ఆవిరి తయారవడానికి తగినంత స్థలం ఉండదు. దీనివల్ల ఆవిరి లీక్ కావడం, ప్రెషర్ సరిగ్గా పెరగకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా పప్పులు లాంటివి వండేటప్పుడు అవి ఉడికిన తర్వాత పైకి పొంగుతాయి. కాబట్టి కుక్కర్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తగినంత మాత్రమే నింపాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
