బరువు తగ్గించి, రక్తాన్ని పెంచే పనస గింజల లడ్డూ.. ఈ స్వీట్ తింటే ఎముకలు దృఢంగా, కంటిచూపు మెరుగ్గా!

Posted By:

పనసకాయ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది దాని అద్భుతమైన తీపి, సువాసన. అయితే పనసకాయలోని తొనలను తిని వాటిని పారేస్తుంటారు చాలామంది. కానీ పనస గింజల ద్వారా లభించే ప్రయోజనాలు, పోషక విలువల గురించి తెలిస్తే ఇక వాటిని పడేయ్యరు. వీటిల్లో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, జింక్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి ఎన్నో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి

వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్ధ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం, రక్తహీనతను నివారిస్తుంది. రక్తంలో హోమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది,కంటి చూపును మెరుగుపరుస్తుంది, ఎముకలు ధృఢంగా మారతాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, చర్మ ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇది బెస్ట్. పనస గింజలను సాంబార్, ఫ్రైలు, కూరల్లో ఉపయోగించడం దక్షిణభారతంలో చాలాకాలంగా వస్తున్న ఆనవాయితీ. అయితే పనస గింజలతో చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన స్వీట్..పనస గింజల లడ్డు కూడా తయారుచేసుకోవచ్చు.

jackfruit seed laddu recipe in telugu healthy sweet for weight loss boost hemoglobin digestion

పనస గింజ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు

-నెయ్యి 1 టేబుల్ స్పూన్
-పనస గింజలు
-కొబ్బరి తురుము
-వేయించిన పల్లీలు
-యాలకలు
-చక్కెర లేదా బెల్లం
-నట్స్

వందల రోగాలను నయం చేసే మునగాకుతో టేస్టీ పూరీ..ఎలా చేసుకోవాలంటే..

పనస గింజ లడ్డు తయారీ విధానం

-ముందుగా పనసగింజల పైన తొక్కును తీసేయండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పనస గింజలు వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. వేగిన తర్వాత పనస గింజలను మిక్సీ జార్ లో వేసి బరకగా ఉండేలా పొడి చేసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ లోనే నెయ్యి వేసి వేడయ్యాక అందులో గ్రైండ్ చేసుకున్న పనస తొక్క పొడిని, కొబ్బరి తురుము వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారేదాకా కలుపుతూ వేయించాలి. తర్వాత ఇందులోనే వేయించిన పల్లీలు, యాలకలు వేసి కలుపుకుని స్టవ్ ఆపేయండి.

-ఇప్పుడు వేయించిన మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్ లో వేయండి.ఇందులోనే రుచికి తగినంత చక్కెర లేదా బెల్లం పొడి వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.

-తర్వాత మీ చేతులకు నెయ్యి రాసుకోండి. గ్రైండ్ చేసుకున్న పొడిని కొంచెం కొంచెం చేతుల్లోకి తీసుకుని లడ్డుల్లా చుట్టుకోండి. తర్వాత మీకు ఇష్టమైతే ఈ లడ్డూల పైన ఒక జీడిపప్పు లేదా బాదంపప్పు పెట్టుకోండి.

-అంతే టేస్టీ, హెల్తీ పనస గింజల లడ్డు రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, October 25, 2026, 11:09 [IST]
Desktop Bottom Promotion