Latest Updates
-
బరువు తగ్గించి, రక్తాన్ని పెంచే పనస గింజల లడ్డూ.. ఈ స్వీట్ తింటే ఎముకలు దృఢంగా, కంటిచూపు మెరుగ్గా! -
వందల రోగాలను నయం చేసే మునగాకుతో టేస్టీ పూరీ..ఎలా చేసుకోవాలంటే.. -
దోశ, రైస్, చపాతీలోకి కిర్రాక్ అనిపించే చికెన్ చాప్స్..ఈ ఆదివారం స్పెషల్ గా మారిపోతుంది -
టిఫిన్స్ లోకి ఈ వెల్లుల్లి చట్నీ చేస్తే..రోజూ తినేదాని కన్నా ఎక్కువ తినేస్తారు! -
ఆదివాసీ ఫిష్ ఫ్రై..గారెల్లా కరకరలాడుతూ భలే రుచిగా -
అయ్యయ్యో పాపం తాత..75 ఏళ్ల వ్యక్తితో 30 ఏళ్ల యువతి పెళ్లి వ్యవహారంలో భారీ ట్విస్ట్..వీడియో చూడండి -
చపాతీ, పూరీల్లోకి అదిరిపోయే శరవణ భవన్ స్టైల్ క్యాలీఫ్లవర్ కుర్మా..ఈజీగా చేసుకోండిలా.. -
అమృతం రుచిని తలపించేలా వంకాయ పచ్చడి..ఇలా చేస్తే 2 నెలలు నిల్వ -
ఆడవారిలో రక్తం బాగా పెరగాలంటే..తరచూ వీటిని తినండి -
నోట్లో పెట్టుకుంటే జారిపోయే పచ్చికొబ్బరి హల్వా..చక్కెర లేకుండానే 10 నిమిషాల్లోనే చేసుకోండిలా..
కొరియన్ల లాగా మెరిసే చర్మం మీ సొంతం కావాలా? అయితే ఈ 5 పండ్లు తినాల్సిందే!
ఈ భూమ్మీద పుట్టిన ప్రతి వ్యక్తి అందంగా ఉండాలనే కోరుకుంటారు. నలుగురిలో ఉన్నప్పుడు అందరూ తమనే చూసేలా, ఆకర్షణీయంగా, అందంగా ఉండాలని కోరుకోవడం చాలా సహజం. కొన్నేళ్లుగా కొరియన్ వెబ్ సీరీస్ లు చూసే భారతీయుల సంఖ్య పెరిగి..వాళ్ల మాదిరి అందంగా, మెరిసే చర్మం రావాలని మార్కెట్లో దొరికే రకరకాల ఖరీదైన క్రీమ్స్, లోషన్స్ వాడున్నారు. అయితే ఖరీదైన క్రీమ్స్ వాడే బదులు మన జీవనశైలి, ఆహారపు అలాట్లు మార్చుకోవాల్సి ఉంటది, మనం తినే ఆహారం మన చర్మ సౌందర్యాన్ని నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా?
మన చర్మానికి ఆకృతిని, యవ్వనాన్ని, దృఢత్వాన్ని ఇచ్చేది కొల్లాజెన్ అనే ప్రోటీన్. వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో దీని ఉత్పత్తి సహజంగానే తగ్గిపోతుంది. అప్పుడే ముడతలు, సన్నని గీతలు రావడం మొదలవుతాయి. ఈ కొల్లాజెన్ ఉత్పత్తిని మళ్లీ పెంచాలంటే మన శరీరానికి కొన్ని ప్రత్యేకమైన పోషకాలు అవసరం. ముఖ్యంగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లను రోజూ డైట్ లో చేర్చుకుంటే మీ చర్మంలో అద్భుతమైన మార్పును చూడవచ్చు. అలాంటి మ్యాజిక్ చేసే 5 అద్భుతమైన పండ్లేవో ఇక్కడ చూడండి.

బొప్పాయి
బొప్పాయి పండు జీర్ణక్రియకే కాదు, చర్మ కాంతికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడమే కాకుండా చర్మానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి.
జామకాయ
పేదవాడి ఆపిల్ గా పిలిచే జామకాయలో మనం ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిలో విటమిన్ సి అత్యధిక మోతాదులో ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని అమాంతం పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని పాడవకుండా కాపాడతాయి. రోజూ ఒక జామకాయను అలాగే తినవచ్చు లేదా ముక్కలు చేసి సలాడ్లలో కలుపుకుని తిన్నా మంచిదే.
స్ట్రాబెర్రీలు
చూడగానే నోరూరించే ఎర్రటి స్ట్రాబెర్రీలు చర్మ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. విటమిన్ సి తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలకు ఇది నిలయం. వీటిని పెరుగులో కలుపుకుని, స్మూతీగా చేసుకుని లేదా ఓట్స్ తో కలిపి తీసుకుంటే చర్మంలో వచ్చే గ్లో చూసి మీరే ఆశ్చర్యపోతారు.

కివి
పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉండే ఈ పండులో విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని వేగవంతం చేసి చర్మానికి నిగారింపును ఇస్తుంది. కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించి, వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకోవడంలో కివిది టాప్ ప్లేస్.
నారింజ
చర్మ సౌందర్యం అనగానే ముందుగా గుర్తొచ్చేది నారింజ పండు. విటమిన్ సి కు ఇది కేరాఫ్ అడ్రస్. కొల్లాజెన్ తయారీకి ఈ పండు చాలా ముఖ్యం. నారింజ పండ్లను ప్రతిరోజూ తినడం వల్ల చర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. వీటిని నేరుగా పండులా తినవచ్చు లేదా జ్యూస్ చేసుకుని తాగొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
