Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే..
ఈ ఏడాది సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. శ్రీకృష్ణుడి పట్టిన రోజుని పురస్కరించుకుని భక్తులందరూ రకరకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు. అయితే, బాలకృష్ణుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదాల్లో పంజిరి ఒకటి. ముఖ్యంగా ధనియాల పంజిరి అంటే కన్నయ్యకు ఎంతో ఇష్టం.
పంజిరి కేవలం దేవుడి ప్రసాదంగానే కాకుండా, ఇందులో వాడే నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ధనియాల వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లోనే ఎంతో సులభంగా, అద్భుతమైన రుచితో ఈ ధనియాల పంజిరిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

ధనియాల పంజిరి తయారీకి కావాల్సిన పదార్థాలు
ధనియాల పొడి - 1 కప్పు
ఆవు నెయ్యి - 3 నుండి 4 టేబుల్ స్పూన్లు
మఖానా (తామర గింజలు) - 1 కప్పు
డ్రై ఫ్రూట్స్ - అర కప్పు (బాదం, జీడిపప్పు, పిస్తా)
ఎండు కొబ్బరి తురుము - అర కప్పు
పొడి చక్కెర (బురా) - అర కప్పు
సారపప్పు (చిరోంజి) - 1 టేబుల్ స్పూన్
యాలకుల పొడి - అర టీస్పూన్
కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే!
ధనియాల పంజిరి తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, మందపాటి అడుగు ఉన్న ఒక కడాయిని పెట్టుకోండి. అందులో 2 టీస్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి వేసి కరిగించండి.
-నెయ్యి వేడెక్కాక అందులో ముందుగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలతో పాటు సారపప్పు (చిరోంజి) వేసి చిన్న మంట మీద వేయించండి. అవి లేత బంగారు వర్ణంలోకి మారి, కమ్మటి వాసన రాగానే ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే కడాయిలో మిగిలిన నెయ్యి వేసి, మఖానా ముక్కలను దోరగా వేయించండి. మఖానాలు కరకరలాడేలా వేగాక వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత కడాయిలో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, తాజాగా దంచిన ధనియాల పొడిని వేయండి. మంటను పూర్తిగా సిమ్ లో ఉంచి, మాడిపోకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. ధనియాల పొడి రంగు కొద్దిగా మారి, ఇల్లంతా కమ్మటి సువాసన వ్యాపించే వరకు వేయించాలి.
-వేగుతున్న ధనియాల పొడిలో ఎండు కొబ్బరి తురుమును వేసి, వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. కడాయికి ఉన్న ఆ వేడికే కొబ్బరి తురుము చక్కగా వేగిపోయి మంచి రుచిని ఇస్తుంది.
-ఇప్పుడు ఈ ధనియాలు, కొబ్బరి వేయించిన మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. అందులో ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, మఖానా, యాలకుల పొడి వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాతే పొడి చక్కెరను వేసి నెమ్మదిగా కలపాలి.
-అంతే ఎంతో రుచికరమైన, కమ్మటి సువాసనలు వెదజల్లే ధనియాల పంజిరి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
