For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘కిచెన్ కింగ్స్’గా మారిన హీరోలు.. చేపల పులుసు ఎలా చేయాలో చెప్పేస్తున్నారు...! మీరు ఓ లుక్కేయండి..

Posted By:
|

కరోనా లాక్ డౌన్ సమయంలో చాలా మంది మగవారు కిచెన్ కింగ్ లుగా మారిపోయారు. ఆ జాబితాలో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. తాజాగా తన తల్లి కోసం స్వయంగా తన చేతితో 'చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు' తయారు చేశారు. సోషల్ మీడియాలోకి రావడం లేట్ అయినప్పటికీ.. లే'టేస్ట్' పోస్టులను చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

సీ ఫుడ్ అంటే ఎక్కువగా ఇష్టపడే చిరు చేపల వేపుడును బాగా ఇష్టపడతారట. తన తల్లి వంట అయితే ప్రాణమిచ్చేస్తాడట. అందుకే ఇటీవల 'అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట' అంటూ వంటలో తనకు ఉన్న నైపుణ్యాన్ని చూపించారు.

View this post on Instagram

#SundaySavors

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

'చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు' స్వయంగా తయారు చేసి.. తన తల్లికి తినిపించిన వీడియోను సోషల్ మీడియాలతో అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఆ వంటను ఎలా చేయాలో కూడా వివరించారు.

అయితే చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో తెలీదు గానీ.. తాజాగా మరో హీరో కూడా చేపల పులుసు స్వయంగా తయారు చేశారు. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఆయనెవరో కాదు ప్రభాస్ కు దగ్గర బంధువు. ఆయనెవరో కాదు క్రిష్టంరాజు.

హీరోలైనా తామంతా కేవలం భోజన ప్రియులే కాదు.. అంతకుమించిన నలభీమ పాకం కూడా చేసే హీరోలమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న చిరంజీవి చేపల ఫ్రై బాగా వైరల్ అవ్వడంతో.. తాజాగా సీనియర్ హీరో క్రిష్ణం రాజు కూడా చేపల పులుసు చేశాడు. తను చేసిన పులుసును వీడియో తీసిన తన కూతురు ప్రసీద.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

'వీకెండ్ స్పెషల్.. డాడీ చేపల పులుసు చేశాడు.. చేపల పులుసు చేయడంలో ఆయనను మించిన వారు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ లేరు. కేవలం వాసన చూసి ఉప్పు సరిపోయిందో లేదో చెప్పేస్తారు. నాన్న అందులో నిపుణుడు' అంటూ చేసిన ట్వీట్ బాగా వైరల్ అయిపోయింది.వీటన్నింటి సంగతి పక్కనబెడితే వారు తయారు చేసిన చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు

చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు

1) చింతకాయలు

2) కట్టె పరిగెలు(చిన్న చేపలు)

3) కారం (తగినంత)

4) పసుపు (తగినంత)

5) ఉప్పు (తగినంత)

6) జీలకర( కొద్దిగా)

7) ఒక ఉల్లిపాయ, మిరప(12 చేపలకు)

8) వంటనూనె (తగినంత)

తయారీ విధానం..

తయారీ విధానం..

ముందుగా ఉల్లిపాయను పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటిని ఆ చేపలు ఉన్న ఒక బౌల్ లో వేసి కలపాలి. ఆ తర్వాత చింతకాయలను తొక్కు మాదిరిగా తయారు చేసుకుని వాటితో బాగా కలపాలి. అవి అన్ని చేపలకు బాగా పట్టేలా కలపాలి. అందులోనే రెండు స్పూన్ల నూనెను వేయాలి. కొద్దిగా ఉప్పు వేయాలి. కొంచెం కారం వేయాలి. ఆ తర్వాత పసుపు వేయాలి.

బౌల్ లో అడుగంటకుండా..

బౌల్ లో అడుగంటకుండా..

ఆ తర్వాత మరో బౌల్ తీసుకుని, గ్యాస్ మీద పెట్టాలి. దానిపై కొద్దిగా నూనె వేయాలి. ఎందుకంటే అవి అడుగంటకుండా ఉండటానికి. దాని మీద ఆ చేపల మిశ్రమాన్ని ఉంచి, గ్యాస్ ను తగినంత మంటలో పెట్టుకోవాలి. అవి అడుగునా మాడిపోయేంత వరకు చేసుకున్నా కూడా అది ఇంకా రుచికరంగా ఉంటుంది. వాటిని ఒక్కసారి తిరగేసిన తర్వాత మళ్లీ తిరగేయాల్సిన పనిలేదు. మీకు అది డ్రైగా ఉందనిపిస్తే మరి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆ తర్వాత దాని మీద కొంచెం జీలకర వేసుకోవాలి. అంతే చింతకాయ తొక్కుతో చేపల పులుసు రెడీ.

ఆంధ్రా స్పెషల్ చేపల పులుసు...

ఆంధ్రా స్పెషల్ చేపల పులుసు...

కావాల్సిన పదార్థాలు..

1) ధనియాలు(టేబుల్ స్పూన్)

2) 7 లేదా 8 వెల్లుల్లి

3) 5 లేదా 6 ఎండు మిర్చి

4) అర చెంచా మెంతులు

5) కట్ చేసిన ఉల్లిపాయలు

6) 4 పచ్చిమిరపకాయలు

7) వంట నూనె

8) కరివేపాకు తగినంత

9) ఉప్పు తగినంత

10) పసుపు తగినంత

11) టమోటా (ఒకటి)

12) కారం తగినంత

13) ధనియాల పౌడర్

14) చింతపండు రసం( 50 గ్రాముల చింతపండు, 200 మి.లీ నీరు)

15) 300 మి.లీ నీళ్లు

16) 300 గ్రాముల చేపల ముక్కలు

17) అల్లం, వెల్లుల్లి పేస్ట్..

పులుసు తయారీ విధానం..

పులుసు తయారీ విధానం..

ముందుగా టేబుల్ స్పూన్ ధనియాలను, ఎండుమిర్చి, అరచెంచా మెంతులను, ఏడెనిమిది వెల్లుల్లిని ఓ బౌల్ లో తీసుకుని గ్యాస్ స్టౌపై చిన్నగా పెట్టుకుని మంచి సువాసన వచ్చేంత వరకు వేగించండి

బాగా వేగించాలి..

బాగా వేగించాలి..

తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలను కలిపి ఓ పేస్టు లాగా తయారు చేసుకోండి. ఓ కడాయి తీసుకుని అందులో అరకప్పు ఆయిల్ ను వేయండి. అది బాగా వేడెక్కిన తర్వాత అందులో మూడు రెమ్మల కరివేపాకు, ఉల్లి, పచ్చిమిర్చి పేస్టును వేసి మీడియం ఫ్లేములో గ్యాస్ ను ఉంచండి. అది పచ్చివాసన పోయిన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించండి.

వాసనపోయేంత వరకు

వాసనపోయేంత వరకు

ఆ తర్వాత కొంచెం ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగించాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేయాలి. ఆ తర్వాత ఓ టమోటను వేసి నూనె పైకి వచ్చేంత వరకు వాసనపోయేంత వరకు వేగనివ్వండి. టమోటలు పూర్తిగా మగ్గిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ కారం.. ఓ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేయండి. అవి బాగా వేగాక..అందులో చింతపండు రసం వేసి బాగా కలపాలి. అందులో 300 మి.లీ నీటిని వేసి మీడియం ఫ్లే మీద మసాల కాచుకోవాలి.

బాగా మరుగుతున్నప్పుడు..

బాగా మరుగుతున్నప్పుడు..

అవి బాగా మరుగుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న చేపల ముక్కలను అందులో వేయండి. గ్యాస్ స్టౌను సిమ్ లోనే ఉంచి అందులో గరిటె పెట్టకుండా కడాయిని రెండువైపులా పట్టుకుని బాగా కదపండి. సన్నటిసెగపై నూనె పైకి తేలాక.. మరోసారి బాగా కదపండి. అప్పుడు ఫోక్ తో ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ముక్క ఉడికిన తర్వాత దానిపై కొతిమీర, గ్రైండ్ చేసుకున్న ధనియాలు, వెల్లుల్లి పొడిని వేయండి. ఆ తర్వాత ఓసారి జాగ్రత్తగా కడాయిని కదపండి. ఆ తర్వాత మరో రెండు నిమిషాలు ఉడికించండి. అయితే దీనిని వేడివేడిగా తినడం కంటే.. పూర్తిగా చల్లారక తినండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేకాదండోయ్ ఈ చేపల పులుసును 24 గంటల తర్వాత తిన్నప్పుడు కూడా ఇదే టేస్టు ఉంటుంది.

[ of 5 - Users]
English summary

Megastar Chiranjeevi make a fish curry for his mother

Here we talking about Megastar chiru make a fish curry for his mother. Read on