Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
స్వీట్లు పేరు చెప్పగానే చాలామందికి నోట్లో నీళ్లు ఊరిపోతుంటాయి. అందులోనూ మాల్పువా స్వీట్ అనగానే ఎప్పుడెప్పుడు అది మన నోట్లో వచ్చి పడుతుందా అన్నంత ఆశక్తి ఉంటుంది. స్వీట్ షాపులో దొరికేలా మెత్తని మాల్పువాని ఇంట్లోనే ఈజీగా తయారుచేపుకోవచ్చు.
బయట కొద్దిగా కరకరలాడుతూ, లోపల నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేంత మృదువుగా ఉండే మాల్పువాలను తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

మాల్పువా తయారీకి కావలసిన పదార్థాలు
పిండి తయారీ కోసం
మైదా పిండి: 1 కప్పు
బొంబాయి రవ్వ (సూజీ): 2 టేబుల్ స్పూన్లు
కోవా లేదా తాజా మీగడ (మలై): పావు కప్పు
పాలు: ఒకటిన్నర కప్పులు
సోంపు పొడి: అర టీస్పూన్
యాలకుల పొడి: అర టీస్పూన్
వేయించడానికి: నెయ్యి లేదా నూనె
చక్కెర పాకం కోసం
చక్కెర: 1 కప్పు
నీళ్లు: అర కప్పు
కుంకుమ పువ్వు: 8-10 పోగులు
యాలకులు: 2
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
మాల్పువా తయారీ విధానం
-ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో మైదా, బొంబాయి రవ్వ, సోంపు పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో మెత్తగా చేసిన కోవా లేదా మీగడను వేయండి. ఆ తర్వాత గోరువెచ్చని పాలను కొద్దికొద్దిగా పోస్తూ, ఎక్కడా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
-మాల్పువాలు మృదువుగా, ఉబ్బినట్లు రావాలంటే.. కలిపిన పిండిని కనీసం 5 నుండి 7 నిమిషాల పాటు ఒకే దిశలో వేగంగా గిలకొట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంపై మూతపెట్టి అరగంట పాటు పక్కన ఉంచండి. ఇలా చేయడం వల్ల రవ్వ చక్కగా నాని, పిండికి సరైన ఆకృతి వస్తుంది.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో చక్కెర, నీళ్లు పోసి మీడియం మంటపై మరిగించండి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత అందులో కుంకుమపువ్వు, దంచిన యాలకులు వేయండి. మాల్పువాకు పాకం ముదురుగా రానవసరం లేదు. రెండు వేళ్ల మధ్య పట్టుకుంటే కాస్త జిగురుగా (గులాబ్ జామున్ పాకంలా) తగిలితే చాలు. వెంటనే స్టవ్ ఆపేయండి.
-మాల్పువాలు వేయించడానికి వెడల్పాటి అడుగు ఉన్న పాన్ స్టవ్ మీద పెట్టి అందులో నెయ్యి వేడి చేయండి. నెయ్యి మరీ పొగలు వచ్చేలా కాకుండా, మీడియం వేడిలో ఉండేలా చూసుకోండి.
-ఇప్పుడు ఒక గుంట గరిటెతో పిండిని తీసుకుని నెయ్యి మధ్యలో నెమ్మదిగా పోయండి. పిండి దానంతట అదే గుండ్రంగా విస్తరిస్తుంది. మంటను తక్కువ నుండి మధ్యస్థంగా ఉంచి, రెండు వైపులా చక్కటి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు దోరగా వేయించండి.
-నెయ్యిలోంచి మాల్పువాను బయటకు తీయగానే, అదనంగా ఉన్న నెయ్యిని వడకట్టేసి, వెంటనే దానిని గోరువెచ్చని చక్కెర పాకంలో వేయండి. మాల్పువా తీపి రసాన్ని బాగా పీల్చుకునేలా 2 నుంచి 3 నిమిషాల పాటు అందులోనే నాననివ్వండి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే వేడివేడి మాల్పువాలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
