శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ఐస్‌ లా కరిగించే సూప్ ఇదే..ఎలా చేసుకోవాలో చూడండి

Posted By:

బరువు తగ్గడం అనేది నేటి కాలంలో చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. ఎక్సర్ సైజ్ లు, కఠినమైన డైట్లు చేసినా ఫలితం అంతంత మాత్రమే అని నిరాశపడుతున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన రెసిపీ ఉంది. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వును ఐస్‌ లా కరిగించే సూపర్ ఫుడ్ గార్లిక్ కొరియాండర్ సూప్(వెల్లుల్లి కొత్తిమీర సూప్). ఇది కేవలం బరువు తగ్గించడమే కాకుండా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరీ ముఖ్యంగా రాత్రి భోజనానికి (డిన్నర్) బదులుగా ఈ సూప్ తాగితే మీ బరువులో స్పష్టమైన మార్పు చూస్తారు.

Melts Fat Like Ice Burn Belly Fat Fast with This Garlic Coriander Soup Recipe in Telugu

వెల్లుల్లి కొత్తిమీర సూప్ కావలసిన పదార్థాలు

వెల్లుల్లి రెబ్బలు - 10 నుండి 15
అల్లం - ఒక అంగుళం ముక్క (సన్నగా తరగాలి)
సన్నగా తరిగిన ఉల్లిపాయ - 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన క్యాబేజీ - 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన క్యాప్సికమ్ - 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన క్యారెట్ - 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన బీన్స్ - 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన టమాటా - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి బఠానీలు -2 టేబుల్ స్పూన్లు
నూనె - 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - రెండు గుప్పెళ్లు (సన్నగా తరగాలి)
జొన్న పిండి - 1 టేబుల్ స్పూన్

వెల్లుల్లి కొత్తిమీర సూప్ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె లేదా సూప్ పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి.

-నూనె వేడెక్కాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి పచ్చివాసన పోయి, కమ్మటి వాసన వచ్చేంతవరకు దోరగా వేయించాలి. ఆ తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ (ఉల్లిపాయ, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, టమాటా, బఠానీలు, పచ్చిమిర్చి) వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించాలి. ఇప్పుడు అందులో సుమారు ఒక లీటరు నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి బాగా మరగనివ్వాలి.

-నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. అలాగే ముందుగా నీళ్లలో కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని వేసి గరిటతో ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. సూప్ కాస్త చిక్కబడి, మృదువుగా మారేంతవరకు మరో రెండు మూడు నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి.

-అంతే నోరూరించే, వేడి వేడి వెల్లుల్లి కొత్తిమీర సూప్ రెడీ.

ఈ సూప్‌ లోని పోషకాలు - అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి: ఇందులో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోని జీవక్రియను వేగవంతం చేసి, కొవ్వును వేగంగా కరిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తుంది.

కొత్తిమీర: ఇది సహజమైన డిటాక్సిఫైయర్. శరీరంలోని వ్యర్థాలను, విషతుల్యాలను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, బ్లోటింగ్ సమస్యలను తగ్గిస్తుంది.

కూరగాయలు: ఇందులో వాడిన రంగురంగుల కూరగాయల వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు (A, C, K), మినరల్స్ అందుతాయి. పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా తాగినా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అతిగా తినడాన్ని నివారించవచ్చు.

జొన్నపిండి : సాధారణంగా సూప్ చిక్కదనం కోసం అందరూ కార్న్‌ఫ్లోర్ వాడతారు, కానీ అది బరువు పెంచుతుంది. దానికి బదులుగా వాడిన జొన్నపిండి గ్లూటెన్ ఫ్రీ మాత్రమే కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. ఇది బరువు తగ్గేవారికి బెస్ట్ ఆప్షన్.

మిరియాలు: మిరియాలు శరీరంలో ఉష్ణాన్ని పుట్టించి క్యాలరీలను కరిగిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

వర్షాకాలంలో సాయంత్రం వేళ ఆకలిగా అనిపించినప్పుడు లేదా రాత్రి భోజనానికి ప్రత్యామ్నాయంగా ఈ సూప్ తాగితే కడుపుకు హాయిగా ఉండటమే కాకుండా ఐస్‌ లా మీ కొవ్వు కరిగిపోవడం ఖాయం.

[ of 5 - Users]
Desktop Bottom Promotion