Latest Updates
-
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ!
తెలుగువారి భోజనం అనగానే మొదట గుర్తొచ్చేది ముద్దపప్పు, ఆవకాయ, కాసింత నెయ్యి. ఈ మూడింటి కలయిక కేవలం భోజనం మాత్రమే కాదు, అదొక మధురానుభూతి.
మనసుకు కష్టం వచ్చినా, ఒంట్లో నలతగా ఉన్నా, లేదా చల్లని వర్షం పడుతున్నప్పుడు కడుపుకు హాయిగా ఏదైనా తినాలనిపించినా వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఘాటైన ఆవకాయ కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. ఈ అద్భుతమైన రుచిని విడివిడిగా కాకుండా, ఒకే గిన్నెలో వండి, మరింత క్రీమీగా, కమ్మగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

ముద్దపప్పు ఆవకాయ అన్నం తయారీ విధానం
-ముందుగా ఈ కమ్మని వంటకానికి కావాల్సిన కందిపప్పును, బియ్యాన్ని విడివిడిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కనీసం ఒక గంట పాటు వీటిని నీళ్లలో నానబెట్టుకుంటే అన్నం, పప్పు మృదువుగా ఉడుకుతాయి.
-ఇప్పుడు అసలు ఘట్టం మొదలవుతుంది. ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ⅓ కప్పు నానబెట్టిన కందిపప్పు వేసి, దానికి ఒక కప్పు నీళ్లు పోయాలి. కుక్కర్ మూతపెట్టి 3 విజిల్స్ వచ్చేలా ఉడికించాలి. పప్పు కాస్త మెత్తబడ్డాక, మూత తీసి అందులోనే ⅔ కప్పు నానబెట్టిన బియ్యం వేయాలి. దీనికి సరిపడా 1⅓ కప్పుల నీళ్లు పోసి మళ్లీ మూతపెట్టాలి. ఈసారి 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అప్పుడు అన్నం, పప్పు రెండూ మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉడుకుతాయి.
-ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకుని అందులో కొద్దిగా నూనె వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేదాకా దోరగా వేయించాలి. వెల్లుల్లి సువాసన వస్తుండగా.. ముందుగా కుక్కర్లో మెత్తగా ఉడికించి పెట్టుకున్న ముద్దపప్పు అన్నం మిశ్రమాన్ని కడాయిలో వేయాలి.
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్!
-ఇప్పుడు ఈ వంటకానికి ప్రాణం పోసే ఆవకాయను తగినంత వేసి బాగా కలపాలి. ఆవకాయ ఘాటు ముద్దపప్పుకు పడుతుంటే అప్పుడే నోట్లో నీళ్లూరుతాయి. ఆ మిశ్రమంలో కొద్దిగా వేడి నీళ్లు పోసి, అన్నం మరింత క్రీమీగా అయ్యేంత వరకు సన్నని మంటపై ఉడకనివ్వాలి.
-చివరిగా ఒక చిన్న కడాయిలో రెండు చెంచాల స్వచ్ఛమైన నెయ్యి వేడి చేసి, అందులో గుప్పెడు జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. మంచి రంగు కోసం కొద్దిగా కాశ్మీరీ కారం చల్లి, ఆ పోపును నేరుగా ఉడుకుతున్న ఆవకాయ అన్నంపై వేయాలి.
-అంతే నోరూరించే ముద్దపప్పు ఆవకాయ అన్నం రెడీ. దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుని, పైన ఇంకొంచెం ఆవకాయ, కరిగించిన నెయ్యి వేసుకుని వేడివేడిగా తిని చూడండి ప్రతి ముద్దలోనూ అమ్మ చేతి స్పర్శ, అంతులేని ఆనందం మీకు ఖచ్చితంగా తెలుస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications