Latest Updates
-
మీరు సెప్టెంబర్లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.? -
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే..
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా..
మన ఇళ్లలో రోజూ చేసుకునే కొత్తిమీర, టమాటా, పుదీనా, పల్లీల చట్నీలు తిని మీకు బోర్ కొట్టిందా? అయితే మీ టిఫిన్ కి ఒక కొత్త రుచిని పరిచయం చేయాలంటే కమ్మని తెల్ల నువ్వుల చట్నీ ట్రై చేయండి. ఇది నేపాల్ దేశంలో చాలా ఫేమస్.
కారంగా, పుల్లగా ఉంటూ భలే రుచిగా ఉండే నేపాలీ స్పెషల్ తెల్ల నువ్వుల చట్నీని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తెల్ల నువ్వుల చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
తెల్ల నువ్వులు - ఒక కప్పు
ఎండు మిరపకాయలు - 4 నుండి 5
వెల్లుల్లి రెబ్బలు - 10 నుండి 12
అల్లం - ఒక చిన్న ముక్క
కొత్తిమీర - ఒక గుప్పెడు
పుదీనా ఆకులు - కొద్దిగా
టమాటా - 1
చింతపండు రసం - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - అవసరమైనంత
నూనె - 2 స్పూన్లు
మెంతులు - కొద్దిగా
కరివేపాకు - రెండు రెమ్మలు
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే..
తెల్ల నువ్వుల చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత అందులో ఒక కప్పు తెల్ల నువ్వులు వేసి, మంటను సిమ్ లో ఉంచి దోరగా వేయించాలి.
-నువ్వులు సువాసన వస్తూ బంగారు రంగులోకి మారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.
-అదే పాన్ లో ఎండు మిరపకాయలను కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి.
-ఇప్పుడు ఒక పెద్ద టమాటాను తీసుకుని నేరుగా స్టవ్ మంట మీద పెట్టి కాల్చుకోవాలి. మంట తక్కువగా ఉంటేనే టమాటా లోపల వరకు చక్కగా ఉడుకుతుంది. బాగా కాలిన టమాటాను నీళ్లలో వేసి, చల్లారాక పై తొక్కను పూర్తిగా తీసివేయాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని.. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, ఎండుమిర్చి, పచ్చి వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో శుభ్రంగా కడిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు, కాల్చి తొక్క తీసిన టమాటా, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు రసం వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఇలా తయారైన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-చట్నీకి అసలైన రుచి తాలింపులోనే వస్తుంది. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక మెంతులు, కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించాలి. ఈ వేడి వేడి తాలింపును నేరుగా మనం సిద్ధం చేసుకున్న నువ్వుల చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి.
-అంతే గుమగుమలాడే నేపాల్ స్పెషల్ నువ్వుల చట్నీ రెడీ.
-ఈ కమ్మని చట్నీని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. చపాతీ, రోటీలతో పాటు.. ఇడ్లీ, దోశల్లోకి కూడా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్.
-అంతేకాదు, ఈ చట్నీతో మీరు అదిరిపోయే ఆలూ చాట్ కూడా చేసుకోవచ్చు. ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కల్లో కొద్దిగా చాట్ మసాలా, రెండు స్పూన్ల ఈ నువ్వుల చట్నీ వేసి కలుపుకుని తింటే, సాయంత్రం పూట అద్భుతమైన స్నాక్ లా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications