సండే స్పెషల్ వెరైటీ ఎగ్ రిసిపిలు...!

కొంత మంది తమను తమూ ఎగ్ టేరియన్స్ గా చెప్పకుంటుంటారు. అందుకు కారణం వారు మాంసాహారం తీసుకోకపోయినా గుడ్డులో అధిక పోషకాలు ఉన్నందు వల్ల, గుడ్డును తినడానికి ఎక్కువగా ఇష్టపడటం వల్ల ఎగేటేరియన్లుగా ఫిక్స్ అయిపోతారు. అంతే కాకుండా గుడ్డును మాసాంహరం అంటారు. కానీ చాలా మంది శాకాహారంగా నే భావిస్తున్నారు కాబట్టే శాకాహారులు కూడా గుడ్డును తినడం మొదలు పెట్టేసారు. గుడ్డులో చెప్పుకోలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు మొండుగా ఉన్నాయి. గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోష కాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు. గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే.

గుడ్డు అనేక పోషకాల మిళితం. ఇందులో శరీరానికి అవసరమయ్యే అన్నీ కీలకమై విటమిన్లు, ఖనిజాలు, మేలు చేసే అన్ శాచురేటెడ్ కొవ్వులు, మాంసకృత్తులు లభిస్తాయి. బరువును కూడా తగ్గిస్తుంది. అలాఅని ఒక రోజుకు నాలుగు గుడ్లును తినడం మంచిది కాదు. గుడ్లను సరైన పద్దతిలో ఉడికించి ఒక రోజుకు ఒకటి రెండు గుడ్లును తినవచ్చు. కాబట్టి గుడ్డువల్ల కొన్ని నిజాలతో పాటు..మరికొన్ని వెరైటీ టేస్టులను తెలుసుకుందాం...

మసాలా ఎగ్ బుర్జీ-ముంబాయ్ స్టైల్

మసాలా ఎగ్ బుర్జీ-ముంబాయ్ స్టైల్

ప్రతి చోటా మసాలా ఎగ్ బుర్జ్ చాలా ప్రత్యేకమైన, బెస్ట్ రిసిపి. ఈ ఎగ్ బుర్జ్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. బ్రెడ్ స్లైస్, జ్యూస్ తో పాటు తీసుకొనే ఎగ్ బుర్జ్ ముంబాయ్ లో చాలా ఫేమస్. కొంత మంది ఈ ఎగ్ బుర్జ్ ను రైస్ మరియు రోటీతో తీసుకుంటారు. గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీనుల అధికంగా ఉండటం వల్ల ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డును(ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్, వేయించిన)తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. దాంతో రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఆకలిని కంట్రోల్ చేస్తుంది. సాధారణంగా మనకు ఎగ్ బుర్జ్ (మసాలాలు, వెజిటేబుల్స్)ఎలా తయారు చేయాలో తెలుసు.

న్యూట్రిషినల్ ఎగ్ దోస-ఫర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్

న్యూట్రిషినల్ ఎగ్ దోస-ఫర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్

నాన్ వెజిటేరియన్ బ్రేక్ ఫాస్టుల్లో ఎగ్ దోస స్పెషల్. ఎగ్ దోస ఫ్రైడ్ ఎగ్ కు కాంబినేషన్ మరియు దోసె కూడా. మీరు మామూలుగా తయారు చేసుకొనే దోసెతో బోర్ అనిపిస్తుంటే ఈ విధంగా ప్రయత్నించి ఒక కొత్త రుచిని టేస్ట్ చేయవచ్చు. దోసె, దానిమీద ఆమ్లెట్ చాలా అద్భుతమైన టేస్ట్ ను అందిస్తుంది. ఈ ఎగ్ దోసకు చట్నీ, సాంబార్ వంటివి అవసరం ఉండదు. ఈ ఎగ్ దోసెను ఏదైనా సాస్ తో తినవచ్చు. ఎందుకంటే ఎగ్ ఫ్రై అయ్యుంటుంది. మరియు పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి తరగు వేయడం వల్ల చట్నీ అవసరం ఉండదు.

ఆరోగ్యానికి-ఆకుకూరలతో ఎగ్ వైట్ ఆమ్లెట్

ఆరోగ్యానికి-ఆకుకూరలతో ఎగ్ వైట్ ఆమ్లెట్

సాధారణంగా ఆమ్లెట్ ను చాలా రకాలుగా వండుతారు. చాలా ఆకలిగా ఉన్నప్పుడు చిటికెలో తయారు చేసుకొని తినగలిగే అల్పాహారం ఎగ్ ఆమ్లెట్. డైయట్ ను పాటించే వాళ్ళు పచ్చసొన ఫాట్, కొలెస్ట్రాల్ శాతం అధికం అనుకొనే వాళ్ళు ఎగ్ వైట్ తో ఆమ్లెట్ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యం. అయితే మరింత టేస్టీగా మరిన్ని పోషకాలు, క్యాలరీలు శరీరానికి అందివ్వాలంటే అందులో ఆకు కూరలు కూడా జత చేసి ఆమ్లెట్ తాయారు చేసుకొని తినొచ్చు. ఇది పిల్లలకూ పెద్దలకూ మంచి పౌష్టికాహారం. అల్పాహారం. ఆకుకూరలు తినమని మారాం చేసి పిల్లలకు ఈవిధంగా తయారు చేసి ఇవ్వడం వల్ల వారికి ఈ విధంగా పోషకాలు అంధించవచ్చు.

స్పైసీ ఎగ్ ఆలూ చాట్

స్పైసీ ఎగ్ ఆలూ చాట్

గుడ్డు తినమని డాక్టర్స్ ఎప్పుడూ సలహా ఇస్తుంటారు. ఎందుకంటే గుడ్డులో అధిక శాతం ప్రోటీనులు కలిగి ఉండటం చేత, ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాన్ని చేకూర్చుతుందని, ఆహారంతో పాటు గుడ్డు కూడా తినమని చెబుతుంటారు. ఎగిటేరియన్ లేదా నాన్ వెజిటేరియన్స్ ప్రియులు ఎగ్ సాండ్విచ్, ఎగ్ ఆమ్లెట్, ఎగ్ టోస్ట్ వంటివి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినడానికి చాలా ఇష్టపడుతుంటారు. ఎగ్ తినడం వల్ల కడుపు నిండుగా ఉండటమే కాకుండా చాలా రుచికరం గా కూడా ఉంటుంది. అయితే ఎన్ని రోజులు ఒకే రకమైన ఎగ్ వంటకాలను రుచి చూస్తుంటాం. కాబట్టి కొంచెం వెరైటీగా ఎగ్ ఆలూ చాట్ తయారు చేసి కొత్త రుచిని చూద్దాం...

బిర్యాని స్పెషల్- ఎగ్ బిర్యాని

బిర్యాని స్పెషల్- ఎగ్ బిర్యాని

కోడి గుడ్డు పోషకాహారం అధికంగా వుండే పదార్ధాలలో ఒకటి. కాని కొల్లెస్టరాల్ కలిగిస్తుందంటూ చాలామంది వదలివేస్తారు. అయితే, గుడ్డుతో ఆహారం చేయటం అతి తేలిక. ఫ్రిజ్ లో ఎల్లపుడూ నిలువ వుంచుకుంటే, పిల్లలకు, పెద్దలకు ఎపుడు కావాలంటే అపుడు కొన్ని రకాల వంటకాలు గుడ్డుతో చేసుకోవచ్చు. పిల్లలు ఆకలి అంటూ సాయంత్రం ఇంటికి వచ్చినపుడు వాటితో ఎగ్ శాండ్ విచ్, లేదా కొన్ని వేపుడు కూరలతో కలిపి ఒక డిష్ గా చేసి ఇవ్వవచ్చు. ఇంటికి అనుకోని అతిధులు వస్తే, తేలికగా ఒక ఎగ్ క్రరీ చేసేయచ్చు. అదే బ్యాచులర్స్ అయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం సులభంగా ఎగ్ బిర్యాని చేసుకోవచ్చు. ఎక్కువ సమయం పట్టదు.

మాంసాహార ప్రియులకు వెరైటీ టేస్ట్ ఎగ్ ఖీమా కర్రీ

మాంసాహార ప్రియులకు వెరైటీ టేస్ట్ ఎగ్ ఖీమా కర్రీ

మాంసాహార ప్రియులకు ఒక అద్భుతమైన రుచితో ఓ వెరైటీ వంటకం ఎగ్ ఖీమా కర్రీ. (ఖీమా చికెన్ లేదా ఖీమా మటన్ లేదా ఖీమా బీఫ్ ఏదైనా వాడుకోవచ్చు)కాబట్టి ఖీమాకు ఎగ్ మిక్స్ చేసి ఓ వెరైటీ వంటను రుచిచూడండి. ఎగ్, ఖీమా రెండు బాగా పాపులర్ నాన్ వెజిటేరియన్. ఈ రెండింటి కాంబినేషన్ లో తయారు చేసుకొనే వంటకం చాలా అద్భుతమైన టేస్టీతో అన్నం, రోటికి మంచి కాంబినేషన్ అవుతుంది.

స్పైసీ మసాలా ఎగ్ పెప్పర్ ఫ్రై

స్పైసీ మసాలా ఎగ్ పెప్పర్ ఫ్రై

గుడ్లుతో ఎన్నో వెరైటీ వంటకాలను వండుతుంటాం. అయినా కూడా ఏదో ఒక కొత్త రుచి కోసం ప్రయత్నిస్తుంటాం. అలాంటి వాటిల్లో మసాలా ఎగ్ పెప్పర్ ఒకటి. ఇది తయారు చేయడం చాలా సులభం. సమయం కూడా తక్కువే. టమోటో మసాలతో, చివరగా గార్నిష్ చేసే పెప్పర్ పౌడర్ తో ఈ వంటకం రుచి అమోఘం. ఇది ఏదైన వెరైటీగా చేసుకొన్న ఫ్రైడ్ రైస్ లకు లేదా పలావ్, మరియు బిర్యానికి కూడా మంచి కాంబినేషన్. మీరు ట్రై చేసి చూడండి.

ఉడికించిన గుడ్డు వేపుడు...!

ఉడికించిన గుడ్డు వేపుడు...!

గుడ్డుతో రకరకాల వెరైటీలు చేస్తుంటాం. ఎగ్ బుర్జ్, ఎగ్ ఆమ్లెట్, ఎగ్ కర్రీ, బాయిల్డ్ ఎగ్ కూర కానీ చేస్తాము కదా. ఎప్పుడూ అదే కాకుండా ఇలా చేస్తే వెరైటీ గా ఉంటుంది. రైస్ లోకి అయినా చపాతి లోకి అయినా బావుంటుంది.

వేడి.. వేడిగా.. ఎగ్ సమోసా..!!

వేడి.. వేడిగా.. ఎగ్ సమోసా..!!

గుడ్లుతో ఎన్నో వెరైటీ వంటకాలను వండుతుంటాం. అయినా కూడా ఏదో ఒక కొత్త రుచి కోసం ప్రయత్నిస్తుంటాం. అలాంటి వాటిల్లో మసాలా ఎగ్ సమోసా ఒకటి. ఇది తయారు చేయడం చాలా సులభం.

వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్

వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్

వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అతి త్వరగా చాలా సులభంగా అతి తక్కువ సమయంలో తయారు చేసుకొనే వంటకం. ఇది బ్రేక్ ఫాస్ట్ గాను లేదా మధ్యాహ్నభోజనం లేదా డిన్నర్ లోనూ తినవచ్చు. చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తినే ఈ వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్ లకు తయారు చేసి ఇవ్వొచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ వేడి వేడిగా తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. వర్షాకాలంలో అయితే మరింత రుచిగా... కారంగా తయారు చేసుకొని తినవచ్చు. గుడ్డులో హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి. ఎగ్ తినడం వల్ల మెదడును చురుకుగా ఉంచుతుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకొన్నట్లైతే బరువు తగ్గడానికి బాగా ఉపకరిస్తుంది. గుడ్డును ఏదో ఒకరకంగా తీసుకోవడం వల్ల ‘ఐ'సైట్ ను తగ్గించి కొవ్వు పెరగకుండా నిరోదిస్తుంది. ఇందులో విటమిన్ బి మరియు విటమిన్ డి మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.

ఎగ్ నూడిల్స్ - సింగపూర్ స్టైల్

ఎగ్ నూడిల్స్ - సింగపూర్ స్టైల్

ఎగ్ నూడిల్స్ చాలా సింపుల్ రిసిపి. అయితే కొంచెం వెరైటీగా సింగపూర్ ఎగ్ నూడిల్స్ ను తింటే చాలా రుచికరంగా ఉంటుంది. సింగ్ పూర్ స్టైల్లో ఎగ్ నూడిల్స్, కి వెజిటేబుల్స్ మరియు బేక్ చేసిన గుడ్డుతో తయారు చేస్తారు. మాంసాహార ప్రియులు వెజిటేబుల్స్ కు బదలు, చికెన్ లేదా, రొయ్యలను ఉడికించి వేసుకోచ్చు. ఇందులో సోయాసాస్, చిల్లీ సాస్ ను కలపడం వల్ల మరింత రుచిని అందిస్తాయి. ఈ సింగపూర్ ఎగ్ నూడిల్స్ ను ఏ టైమ్ లో అయినా, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కు తీసుకోవచ్చు. ఇందులో ఉపయోగించిన పాక్ చోయ్ ఆకులు బయట మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Story first published: Sunday, February 17, 2013, 9:30 [IST]
Desktop Bottom Promotion