మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

నోటికి రుచిగా ఉందని జంక్ ఫుడ్ తినడం, స్వీట్లు లాగించడం, ఇష్టమైన ఆహారం కనిపిస్తే అతిగా తినడం..ఇవన్నీ మనకు మామూలు విషయాలుగా మారిపోయాయి. కానీ ఈ చిన్న చిన్న అలవాట్లే మన ఆరోగ్యాన్ని లోపలి నుంచి తొలిచేస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని ప్రతి అవయవం సక్రమంగా పనిచేయాలి.

Are Your Habits Killing Your Kidneys 5 Warning Signs You Should Know

మన శరీరంలో పేరుకుపోయిన మలినాలను, వ్యర్థాలను రక్తం నుంచి వడబోసి, మూత్రం ద్వారా బయటకు పంపే అద్భుతమైన ఫిల్టర్ కిడ్నీ. ఇది ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం లోపల శుభ్రంగా ఉంటుంది. కానీ కిడ్నీలు పాడవుతున్నాయని చెప్పే లక్షణాలు చివరి దశ వరకు బయటపడవు. అందుకే మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పొరపాట్లు ఈ కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.

నీళ్లు ఎంత తాగుతున్నారు?
ఆరోగ్యానికి నీరు చాలా అవసరం. కానీ కొందరు గంటకో బాటిల్ నీళ్లు ఖాళీ చేస్తుంటారు, మరికొందరు దాహం వేసినా నీళ్లు తాగడానికి బద్ధకిస్తుంటారు. ఈ రెండూ ప్రమాదరమే. నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

అలాగని అతిగా నీరు తాగితే ఆ నీటిని వడపోయడానికి కిడ్నీల మీద అనవసరమైన భారం పడుతుంది. అందుకే మీ వయసు, మీరు చేసే పనిని బట్టి మీ శరీరానికి అవసరమైన మేరకే సమతుల్యంగా నీటిని తీసుకోండి.

పెయిన్ కిల్లర్స్..ప్రాణాలకే కిల్లర్స్
తలనొప్పి వచ్చినా, కీళ్ల నొప్పి వచ్చినా డాక్టర్‌తో పనిలేకుండా వెంటనే మెడికల్ షాపుకెళ్లి పెయిన్ కిల్లర్ లేదా యాంటీబయాటిక్స్ తెచ్చుకుని వేసుకునే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. ఇలా తరచుగా సొంత వైద్యం చేయడం వల్ల ఆ మందులలోని రసాయనాలు నేరుగా కిడ్నీల పనితీరును నాశనం చేస్తాయి. డాక్టర్ల సలహా లేకుండా ఏ ట్లాబ్లెట్ కూడా వేసుకోకూడదు.

మాంసాహారం మరీ ఎక్కువైతే ముప్పే
మన భోజనంలో ఎప్పుడూ సమతుల్యత ఉండాలి. కానీ కొందరు వారానికి నాలుగైదు సార్లు మాంసాహారం లాగించేస్తుంటారు. ముఖ్యంగా రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.

ఈ యూరిక్ యాసిడ్ కిడ్నీల్లో రాళ్లుగా మారి, భరించలేని నొప్పిని తెచ్చిపెడుతుంది. ప్రొటీన్ అవసరమే కానీ అది అతిగా మారితే కిడ్నీలకు శ్రమ పెరుగుతుంది. కాబట్టి మాంసాహారాన్ని మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోండి.

Are Your Habits Killing Your Kidneys 5 Warning Signs You Should Know

మూత్రాన్ని గంటల తరబడి ఆపుకుంటున్నారా?
పని ఒత్తిడి వల్లనో, ప్రయాణాల్లో ఉన్నామనో లేదా బద్ధకం వల్లనో చాలామంది మూత్ర విసర్జన చేయకుండా గంటల తరబడి ఆపుకుంటారు. ఇది కిడ్నీలకు చేసే అతిపెద్ద ద్రోహం.

ఇలా చేయడం వల్ల శరీరంలోంచి బయటకు వెళ్లాల్సిన బ్యాక్టీరియా, వ్యర్థాలు తిరిగి కిడ్నీలకు చేరుకుంటాయి. దీనివల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి, మూత్రనాళాల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది.

హై బీపీ
అధిక రక్తపోటు (హై బీపీ) గుండెకే కాదు, కిడ్నీలకు కూడా బద్ధ శత్రువే. రక్తపోటు పెరిగినప్పుడు కిడ్నీలకు రక్తాన్ని సరఫరా చేసే చిన్న రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇది క్రమంగా వాటిని దెబ్బతీసి కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు మీ బీపీని చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీ ఉంటే డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడుతూ దానిని అదుపులో ఉంచుకోవాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, April 23, 2026, 10:32 [IST]
Desktop Bottom Promotion