Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బట్టర్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ : టేస్టీ సైడ్ డిష్
బట్టర్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ పాపులర్ బెంగాల్ రిసిపి. చాలా సింపుల్ గా చేయదగినటువంటి వంటకం. చాలా సింపుల్ గా చందువా ఫిష్ ను గార్లిక్ మరియు బట్టర్ తో మ్యారినేట్ చేసి ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ ఫిష్ ఫ్రై రిసిపితో గ్రేవీ కూడా తయారు చేసుకోవచ్చు.
డ్రై ఫిష్ బటర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బెంగాల్ లో చాలా పాపులర్ అయిన ఫేవరెట్ వంటకం. పెళ్ళి రోజు లేదా బర్త్ డే పార్టీలకు ఓ మంచి టేస్ట్ ఉన్న ఈ బెంగాల్ ఫేవరెంట్ ఫిష్ ఫ్రై మనం కూడా చేసుకోవచ్చు. వండే పదార్థాలు కొంచెం ఎక్కువైన రుచి అద్భుతంగా ఉంటుంది. సింపుల్ గా ఎలా తయారు చేయాలో చూద్దాం...READ MORE: రహు ఫిష్ లోని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు

కావల్సిన పదార్థాలు:
చందువా చేప ముక్కలు: 1kg
మైదా : 2tbsp
కార్న్ ఫ్లోర్: 2tbsp
వెన్న: 4tbsp
బేకింగ్ పౌడర్: 1tsp
వెలుల్లి, కొత్తిమీర తురుము : 4tbsp
ఉప్పు: రిచికి సరిపడా
READ MORE: చేప నూనె యొక్క 12 ఆరోగ్య ప్రయోజనాలు
తయారుచేయు విధానం:
1. ముందుగా వెల్లుల్లి తురుము, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్ ను కలపాలి.
2. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి ఈ మిశ్రమాన్ని జారుడుగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించి కాసేపు, వాటిని పక్కన పెట్టుకోవాలి.
4. అరగంట తర్వాత నాన్ స్టిక్ పాన్ ను లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో చేపముక్కలు ఒక్కొక్కటి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
5. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే బటర్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ రెడీ...



Click it and Unblock the Notifications