Latest Updates
-
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
డిన్నర్ పార్టీ స్పెషల్ - చికెన్ ముర్గ్ కుర్మా
ముర్గ్ కుర్మాను స్పెషల్ గా వండుతారు. దీన్ని కొబ్బరి మరియు పెరుగుతో తయారు చేస్తారు. ఈ రుచికరమైన చికెన్ ముర్గ్ కుర్మాను రోటీ, చపాతీ, నాన్ తో తినవచ్చు. ఈ రుచికరమైన టేస్టీ వంటకం రాత్రి డిన్నర్ పార్టీకి బాగా సూట్ అవుతుంది.

కావలసిన పదార్థాలు:
చికెన్ డ్రమ్ స్టిక్: 1/2kg
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
ఉల్లిపాయ ముక్కలు: 1cup
కారం: 2tsp
పసుపు: 1/4tsp
ధనియా పౌడర్: 2tsp
కొత్తిమీర: కొద్దిగా
పెరుగు: 1cup
నిమ్మరసం: 1tsp
నెయ్యి: 1tbsp
గరం మసాలా: 1tbsp
అల్లం తురుము: 1tsp
ఉప్పు : రుచికి తగినంత
మసాలా కోసం:
జీడిపప్పు: 8-10
చిరోంజి(మోరీ పళ్ళు/సారపప్పు): 50grms(మార్కెట్లో దొరుకుతుంది)
ఎండు కొబ్బరి తురుము: 50grms
ఉల్లిపాయలు: 50grms
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి.
2. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
3. ఇప్పుడు అందులో చికెన్ డ్రమ్ స్టిక్ వేసి రెండు నిమిషాలు వేయించిన తర్వాత పెరుగు కూడా చేర్చి ఉడికించుకోవాలి.
4. చికెన్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యి, పైకి కనబడుతుండగా అప్పుడు, అందులో కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ అన్నింటినీ వేసి ఐదు నిమిషాల పాటు తక్కువ మంట మీద వేయించుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే జీడిపప్పు మసాలా పేస్ట్ ను కూడా చేర్చి బాగా వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి చికెన్ బాగా ఉండికించుకోవాలి.
6. చివరగా గరం మసాలా, నిమ్మరసం, కొత్తమీర తురుము మరియు అల్లం తురుము వేసి రెండు నిమిషాల తర్వాత క్రిందికి దింపుకొని హాట్ హాట్ గా సర్వ్ చేయాలి. అంతే చికెన్ డ్రమ్ స్టిక్ ముర్గ్ కుర్మా రెడీ...



Click it and Unblock the Notifications