Latest Updates
-
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా
రంజాన్ నెలలో చికెన్ హలీమ్ రుచి చూడాల్సిందే...
రంజాన్ మాసం అంటే కొన్ని ప్రత్యేక వంటకాలకు ప్రసిద్ధి. హలీమ్, ఖర్జూరా, సేమ్యాలు వంటి పదార్థాలు అందరికీ నోరూరిస్తాయి. రంజాను మాసంలో ఎంతో మంది హలీమ్ రుచిని ఆస్వాదిస్తునే ఉంటారు. మరి అలాంటి హలీమ్‌కు పెట్టింది పేరు పురానాషహర్. అనేక రకాల మసాలాలు, మాంసం, గోధుమ రవ్వ, సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్ అన్నింటినీ కలిపి చేసే వంటకమే హలీమ్. హలీమ్ కు ఉన్న ప్రాధాన్యతను బట్టి రంజాన్ మాసంలోనే కాకుండా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఏడాది మొత్తం కాలం దొరికే ప్రాంతాలు ఉన్నాయంటే అతిశయోక్తికాదు.

ఈ హలీమ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. హైదరాబాదునుండి విదేశాలకు రోజూ పార్సల్ చేయబడుతుందంటే నమ్ముతారా?? అన్ని వంటకాలలాగా హలీమ్ తయారు చేయడం అంత సులువేమీ కాదు.. కాని తరచూ బయటకెళ్లి తినాలంటే అందరికీ కుదరదు కదా. మరి అదే హలీమ్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది కష్టమేమీ కాదు కాని మసాలాలు, శ్రమ కాస్త ఎక్కువే..
కావలసిన వస్తువులు:
బోన్ లెస్ చికెన్: 1/2kg
గోధుమ రవ్వ: 1/4kg
సెనగపప్పు: 2tbsp
బియ్యం: 2tbsp
పచ్చిమిర్చి: 6-8
అల్లం వెల్లుల్లి ముద్ద : 2tsp
పసుపు: 1 tsp
కారం పొడి: 2tsp
గరం మసాలా: 1tsp
మిరియాలపొడి: 1/2tsp
సొంటి పొడి : 1/2tsp
నారీ మసాలా లేదా పోట్లీ మసాలా: 1tbsp
పుదీనా , కొత్తిమిర తరుగు: 1/2cup
ఉల్లిపాయ: 2
లవంగాలు: 8
దాల్చిన చెక్క: చిన్న ముక్కలు రెండు లేదా మూడు
యాలకులు: 8
షాజీరా: 2tsp
పెరుగు: 1cup
ఉప్పు: రుచికి తగినంత
నూనె : 1/4 కప్పు
నెయ్యి : 5 tbsp
తయారు చేయు విధానం
1. ముందుగా కుక్కర్లో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, సెనగపప్పు, బియ్యం, చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద, సగం యాలకులు, లవంగాలు, దాల్చిన, షాజీరా, సగం పుదీనా, రెండు పచ్చిమిర్చి, కొత్తిమిర వేయాలి.
2. అందులోనే సగం చెంచా పసుపు కూడా వేయాలి. నారీ మాసాలా లేదా పోట్లీ మసాలా ఒక సన్నటి బట్టలో మూతకట్టి వేసి, తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. నాలుగు విజిల్స్ వచ్చాక మూత తీసి గోధుమ రవ్వ వేసి కలిపి మూతపెట్టాలి. మళ్లీ నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
3. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత పొట్లీ మసాలా మూట తీసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద ఒక పాన్ లేదా మందపాటి గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. ఇందులో మిగిలిన లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీర , అల్లం వెల్లుల్లి ముద్ద, మిగిలిన పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేయాలి. నూనెలో కొద్దిగా వేగాక కారం, మిరియాలపొడి, సొంటిపొడి, గరం మసాలా వేసి కలుపుతూ వేయించాలి.
5. తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వేసి కలపాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న చికెన్ మిశ్రమం, తగినంత ఉప్పు వేసి చిన్న మంటమీద కలుపుతూ ఉడికించాలి. లేదా పొయ్యి మీద ఇనప పెనం పెట్టి దాని మీద ఈ గిన్నె పెడితే మాడకుండా నిదానంగా ఉడుకుతుంది.
6. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మిగిలిన కొత్తిమిర, పుదీనా నూనెలో కరకరలాడేలా వేయించి పెట్టుకోవాలి. హలీమ్ మొత్తం ఉడికి మంచి వాసన వస్తున్నప్పుడు నెయ్యి వేసి కలిపి మరి కొద్ది సేపు ఉంచాలి. మొత్తం ఉడికి నూనె నెయ్యి కలిసి పైకి తెలుతుండగా దింపేసి సర్వింగ్ బౌల్ లో వేసి వేయించిన ఉల్లిపాయ, కొత్తిమిర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసి నిమ్మరసం పిండి సర్వ్ చేయాలి. అంతే చికెన్ హలీమ్ రెడీ...



Click it and Unblock the Notifications