Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
ఉల్లిపాయలేని చికెన్ టమోటో గ్రేవీ రిసిపి
ప్రస్తుతం ఇండియలో ఉల్లిపాయ ధర రోజురోజుకూ బంగారం ధర పెరిగినట్లు పెరిగిపోతోంది. సామన్య ప్రజానికానికి చాలా కష్టంగా మారుతున్నది. ఎందుకంటే ఇండియన్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉల్లిపాయలు ఉపయోగిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉల్లిపాయ లేకుండా కొన్ని రుచికరమైన వంటకాలు కూడా ఉన్నాయని తెలియజేయడానికి మీకోసం మేము అంధిస్తున్న చికెన్ టమోటో గ్నేవీ రిసిపి, చాలా టేస్ట్ గా ఉంటుంది.
ఈ రుచికరమైన చికెన్ టమోటో గ్రేవీ రిపిసి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు . చికెన్ పెరుగు, మసాలా దినుసులతో మ్యారినేట్ చేసుకోడం ప్రధానం అంశం. తర్వాత రెండవది, టమోటో గ్రేవీ. ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతమైన రుచి ఇస్తుంది. చికెన్ లవర్స్ కోసం నోరూరించే ఈ టమోటో గ్రేవీ రిసిపిని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం..
కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg(మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పెరుగు: 1cup
టమోటాలు: 5 (గుజ్జులా తయారుచేసుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పచ్చిమిరపకాయలు: 3
గసగసాలు: 2tbsp
పసుపు: 1tsp
నల్ల మిరియాలు పొడి: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
ధనియాలపొడి: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
చక్కెర: ½tsp
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం: 1tbsp
నూనె: 2tbsp
నీళ్ళు: 1cup
కొత్తిమీర గార్నిషింగ్ కోసం: 2tbsp(చిన్నగా సన్నగా తరిగిపెట్టుకోవాలి)

1. ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
2. తర్వాత చికెన్ ముక్కలను నిమ్మరసం, పెరుగు, ఉప్పు, మరియు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత గసగసాలు మరియు పచ్చిమిర్చిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
4. ఒక గంట తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేసిన తర్వాత, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసి, 10నిముషాల పాటు వేగించుకోవాలి.
6. తర్వాత అందులోనే టమోటో గుజ్జు, ఉప్పు, పసుపు వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. 5నిముషాలు వేగించిన తర్వాత ధనియాలపొడి, మిరియాలపొడి, పంచదార, గసగసాల పేస్ట్ అన్నీ వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
8. చికెన్ ముక్కలతో పాటు మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత అందులో నీళ్ళు పోసి, మూత పెట్టి 20నిముషాలు మీడియం మంట మీద ఉడికించాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
9. ఒకసారి చికెన్ ముక్కలు ఉడికిందని నిర్ధారించుకొన్న తర్వాత గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి.
10. చికెన్ గరం మసాలా రెండు బాగా మిక్స్ అయ్యాక స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే చికెన్ టమోటో గ్రేవీ రెడీ. అంతే వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications