Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
కోకోనట్ చికెన్ : సౌత్ ఇండియన్ స్టైల్ కర్రీ
కొబ్బరిని మన సౌత్ ఇండియాలో ఎక్కువగా వంటలకు ఉపయోగిస్తుంటారు. కొబ్బరి తురుము డిఫరెంట్ టేస్ట్ ను అంధిస్తుంది. కొబ్బరి తురుము ఏ వంటకు చేర్చిన ఒక డిఫరెంట్ టేస్ట్ ను మరియు ఆరోమా వాసను ఇస్తుంది. అంతే కాదు, కర్రీస్ మరియు సలాడ్స్ కు గార్నిష్ గా కూడా కొబ్బరి తురుము వేసుకోవచ్చు.
వెజ్ లాగే, నాన్ వెజ్ లో కూడా కొబ్బరి తురమునుజోడిస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది . కొబ్బరితో తయారుచేసే వంటలు రోటి మరియు రైస్ కు మంచి కాంబినేషన్ గా ఉంటుంది. మరి మీరు కూడా అటువంటి రిసిపిని తయారుచేయాలనుకుంటుంటే ఇక్కడ మీకోసం ఒక నాన్ వెజ్ స్పెషల్ ఐటమ్...

కావల్సిన పదార్థాలు:
చికెన్: 500 gms(మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి)
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొబ్బరి పాలు: 1cup
పచ్చిబఠానీలు: ¼cup
పచ్చిమిర్చి: 3-4 (సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
టమోటో గుజ్జు: ½tsp
జీలకర్ర: 1tsp
ఆవాలు ½ tsp
గరం మసాలా: 1tsp
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
వెజిటబుల్ ఆయిల్: 2tbsp
గ్రేవీ మసాలా కోసం
జీడి-¼cup(10-15నిముషాలు నీటిలో నానబెట్టుకోవాలి)
లవంగాలు : 2
స్టార్ సొంపు: 1
యాలకులు: 1
దాల్చిన చెక్క: ఒక అంగుళం
తయారుచేయు విధానం:
1. ముందుగా గ్రేవీ మసాలకోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరియు దాన్ని పేస్ట్ చేసుకోవాలి.అలాగే అందులో నీటిలో నానబెట్టుకొన్న జీడిపప్పు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ లో స్టౌ మీద పెట్టి, అందులో నూనె వేసి, కాగిన తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి.
3. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు మరియు గ్రేవీ మసాలా పేస్ట్ వేసి వేయిచుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా ఉడికే వరకూ వేయించుకోవాలి.
4. మసాలా కూడా పచ్చివాసన పోయే వరకూ వేయించుకొని తర్వాత చికెన్ ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి మీడియం మంట మీద 5నిముషాలు వేయించుకోవాలి.
5. ఇప్పుడు అందులో టమోటో గుజ్జు కూడా వేసి మరో పది నిముసాలు వేయించాలి. తర్వాత పచ్చికొబ్బరి పాలను పోసి ఉడికించాలి. గ్రేవీ చిక్కగా మారేటప్పుడు అందులో కారం మరియు గరం మసాలా మరియు పచ్చిబఠానీలు వేసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి. అంతే సౌత్ ఇండియన్ స్టైల్ కోకోనట్ చికెన్ కర్రీ రెడీ. ఇది రోటీ లేదా రైస్ కు చాలా అద్భుతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications