Latest Updates
-
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
స్పైసీ అండ్ టేస్టీ డాబా స్టైల్ మటన్ కర్రీ
నార్త్ ఇండియన్ వంటకాల్లో కొద్దిగా కారంగా మరియు ఆయిలీగా ఉంటాయి. ముఖ్యంగా కర్రీలు మరియు ఇతర సైడ్ డిష్ లు వంటివి చాలా కారంగా టేస్టీగా తయారు చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వీరి వంటలు డాబా స్టైల్లో ఉంటాయి. డాబా స్టైల్ అంటే రోడ్ సైడ్లలో చిన్న ఫుడ్ జాయింట్స్ . ఎక్కువగా హైవే ఫుట్ పాత్ ల మీద ఎక్కువగా ఉంటాయి. డాబా స్టైల్ రిసిపిలు ఇండియన్ వంటకాల్లో చాలా పాపులర్...
ఇది స్పైసీగా ఉండే నార్త్ ఇండియన్ డాబా స్టైల్ మటన్ రిసిపి. చాలా టేస్టీ గా ఉంటుంది. ఈ డాబా స్టైల్ మటన్ ఇడ్లీ, దోసె, చపాతీ రైస్ కు చాలా మంచి కాంబినేషన్ దీన్ని ఒకసారి రుచిచూస్తే మళ్ళీ మళ్ళీ తినాలినిపిస్తుంది. డాబా మటన్ కుర్మాలో కాశ్మిరి మిర్చీ, టమోటో గుజ్జు చేర్చడం వల్ల మరింత టేస్ట్ మరింత చిక్కగా తయారవుతుంది. కాబట్టి డాబా స్టైల్ మటన్ ను మీరు ట్రై చేసి దోసె, ఇండ్లీ, చపాతీతో, రైస్ రుచి చూడండి....

మటన్: 500gms(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం: 1inch(చితగొట్టుకోవాలి)
టమోటో గుజ్జు: 1cup
వెల్లుల్లి రెబ్బలు: 5-6 pods(తురుముకోవాలి లేదా చిన్నముక్కలు చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2(కట్ చేసుకోవాలి)
కారం: 1tsp
పసుపు: 1tsp
ధనియాల పొడి: 1 ½tsp
కాస్మిర్ మిర్చి: 1tsp
పంచదార: ½tsp
జీలకర్ర పొడి: 1tsp
గరం మసాలా: ½tsp
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 2-3
యాలకులు: 2
బిర్యాని ఆకు: 1
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: ½ cup
నీళ్ళు: 2 cups
తయారు చేయు విధానం:
1. ముందుగా గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి, వేడయ్యాక అందులో మటన్ వేసి మీడియం మంట మీద ఉడికించాలి. మటన్ ఆఫ్ బాయిల్ అయిన తర్వాత స్టౌ మీద నుండి దింపి పక్కన పెట్టుకోవాలి.
2. అతే పాన్ లో మరో మూడు చెంచాలా నెయ్యి వేసి, వేడయ్యాక అందులో బిర్యాని ఆకు, యాలకులు, చెక్క, లవంగాలు వేయాలి రెండు నిముషాలు వేయించుకోవాలి.
3. తర్వాత అందులోనే ఉల్లిపాయల, అల్లం, మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత వీటిని మీడియం మంటలో ఉంచి అంతలోపు పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జిలకర్రపొడిని ఒక గిన్నెలో తీసుకొని, కొద్దిగా నీళ్ళు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి.
4. గిన్నెల్లో ఫ్రై అవుతున్న మిశ్రమంలో ఉడికించి పెట్టుకొన్న మటన్ ముక్కలను, గిన్నెలో కలిపి పెట్టుకొన్ని పసుపు, ధనియాలపొడి మిశ్రమాన్ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా నీళ్ళు పోసి మరోసారి కలియబెట్టి మూత పెట్టి అతి తక్కువ మంట మీద అరగంట పాటు బాగా ఉడకనివ్వాలి.
5. అరగంట తర్వాత మూత తీసి అందులో టమోటో గుజ్జు, కాశ్మిరీ మిర్చి, గరం మాసాలా మరియు పంచదార వేసి మూత పెట్టకుండా మరో ఐదు నిముషాల పాటు ఉడికించుకోవాలి. అంతే డాబా స్టైల్ మటన్ కర్రీ రెడీ. దీన్ని కొత్తిమీర తరుగుతో గార్నిస్ చేయాలి. దీన్ని రైస్, రోటీలతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications