Latest Updates
-
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే -
బంబుల్ యాప్లో ఇక స్వైపింగ్ లేదు! డేటింగ్ ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఆ కొత్త AI ఫీచర్ ఇదే -
టైమ్ లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.. 20 నిమిషాల్లో స్పైసీ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో ఎండల మంటలు: గర్భిణులు, మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మదర్స్ డే రోజున అత్తాకోడళ్ల మధ్య గొడవలు… అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు! -
మీ కళ్ళు అలా అవుతున్నాయా? అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే! -
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే! -
మామిడిపండు ఉదయం తినాలా? మధ్యాహ్నాం తినాలా? రాత్రి తినాలా?..నిపుణులు ఏమంటున్నారంటే..
ఎగ్ బిర్యానీ

కోడిగుడ్లు: 6(ఉడకబెట్టి, నిలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2
టొమోటో: 1
కొత్తిమీర: 1/2cup
పుదీనా: 1/2cup
నెయ్యి: 2tbsp
ఆయిల్: 2tbsp
పెరుగు: 1 cup
పచ్చిమిర్చి: 6
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tbsp
కారం: 2 tsp
దనియా పౌడర్: 2tsp
నిమ్మరసం: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కుంకుమపువ్వు: 1/2tsp(గోరువెచ్చని పాలలో నానబెట్టాలి)
అన్న వండడానికి కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 3cup, లవంగాలు: 4, ఏలకులు: 5, ఉప్పు: కొద్దిగా, ఆయిల్: 1 tbsp, మారాటి మొగ్గ: 2, బిర్యానీ ఆకుల:2, నీళ్లు: సరిపడా.
బిర్యానీ మసాలా: లవంగాలు: 4, దాల్చిన చెక్క: 1, షాజీరా :1/2 tsp, మిరియాలు:5(పై పదార్థాలు పొడి చేసుకోవాలి)
తయారు చేయు విధానము:
1. బాస్మతి బియ్యంలో సరిపడా నీటిని పోసి, లవంగాలు, ఏలకులులు, బిర్యానీ ఆకు, మరాటి మొగ్గ, పుదీనా, నూనె, ఉప్పు వేసి అన్న వండాలి.
2. తర్వాత వెడల్పాటి ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చాలి. పాత్రలో నెయ్యి, ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయలు వేసి లేత ఎరుపురంగు వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి.
3. పచ్చిమిర్చి అల్లం, వెల్లుల్లి ముద్ద ఒకదాని తరువాత ఒకటి వేసి 2 నిమిషాలు వేయించాలి. కారం, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.
4. తర్వాత టమోటో, కోడిగుడ్లు వేసి మిగతా పదార్థాలతో పాటు కలిసేలా వేయించాలి. ఇప్పుడు పెరుగు, నిమ్మరసం వేసి అయిదు నిమిషాలపాటు వేయించి దింపేయాలి.
5. ఒకపాత్ర తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి తర్వత మొదటగా తయారు చేసి పెట్టుకొన్న అన్నం అందులో వేయాలి.
6. తర్వాత దాని మీద కోడిగుడ్డు మసాలి వేసి స్ర్పెడ్ చేయాలి. తర్వాత మిగతా అన్నం, మసాలా కూడా ఇలాగే వేయాలి. ఆపై నెయ్యి, పాలలో నానబెట్టిన కుంకుమపువ్వుచిలకరించి, కొత్తిమీర చల్లి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించి దింపేయాలి.
7. తర్వాత పెనం వేడి చేసి దాని మీద బిర్యానీ పాత్ర పెట్టి చిన్న మంట మీద 15నిమిషాల పాటు ఉంచి దింపేయాలి. అంతే ఎగ్ బిర్యాని రెడీ. ఇష్టమైన కాంబినేషన్ తో వడ్డించాలి.



Click it and Unblock the Notifications