Latest Updates
-
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా..
కోకోనట్ మిల్క్ -ఎగ్ కర్రీ

గుడ్లు: 4(ఉడికించినవి)
ఉల్లిపాయలు: 2(ముక్కలుగా కట్ చేసుకొన్నవి)
టమోటో: 2(ముక్కలుగా కట్ చేసుకొన్నవి)
వెల్లుల్లి రెబ్బలు: 6-8
అల్లం: చిన్న ముక్క
పచ్చిమిర్చి: 4-6(ముక్కలుగా కట్ చేసుకొన్నవి)
కారం: 1tsp
ధనియాపొడి: 1/2tsp
పసుపు: 1/4tsp
కొబ్బరి తురుము: 1/2cup
కొత్తమీర తరుగు: 1tbsp
గరం మసాలా: 1/2tsp
యాలకులు: 1 లేదా 2
నూనె: సరిపడా
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా గుడ్లను ఉడికించి పై పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి.
2. అలాగే ఉల్లిపాయలు, టమోటో, పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా తరిగి పెట్టుకోవాలి.
3 పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఉడికించిన గుడ్లను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. అంతలోపు మిక్సీలో ఉల్లిపాయముక్కలు కొన్ని, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కొన్ని, కొత్తిమీర కొద్దిగా మరియు కొబ్బరి తరుము వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. గుడ్లను వేయించిన పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, యాలకుల పొడి వేసి బాగా వేయించాలి.
6. అందులోనే మిక్సీలో వేసుకొన్నమసాలా పేస్ట్ కూడా వేసి, కలుపుతూ మరో ఐదు నిమిషాల పాటు వేయించాలి. మసాల మీద నూనె తేలుతుండగా అప్పుడు కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, ఉప్పు, వేసి అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించాలి.
7. కొబ్బరి మసాలా ఉడికి, గ్రేవి చిక్కబడే సమయంలో ఫ్రై చేసి పెట్టుకొన్న గుడ్లను అందులో వేసి కలిపి రెండు నిమిషాల తర్వాత క్రిందికి దింపుకోవాలి. అంతే కోకోనట్ మిల్క్ ఎగ్ కర్రీ రెడీ. దీన్ని వేడి వేడి అన్నం లేదా రోటితో సర్వ్ చేయండి.



Click it and Unblock the Notifications