Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఎగ్ మసాలా: హైదరాబాద్ స్పెషల్
ఎగ్(గుడ్లు)ఒక వెర్సిటైల్ రిసిపి. ఎందుకంటే, దీన్ని వివిధ రకాలుగా తయారుచేయవచ్చు. అదేవిధంగా. ఎగ్ కర్రీ చాలా మందికి ఒక ఫేవరెట్ ఎగటేరియన్ రిసిపి . ఎగ్ కర్రీని ఇండియాలో చాలా డిఫరెంట్ గా వివిధ పద్దతుల్లో తయారుచేస్తారు. ప్రాంతలా వారిగా కూడా వివిధ రకాలుగా తయారుచేస్తారు. అయితే అందరూ కూడా వారికి నచ్చిన అద్భుతమైన టేస్ట్ ను రుచిచూస్తారు.
రాయల్ సిటి హైదరాబాద్ లో ఎగ్ మసాలా స్సెషల్ ఎగ్ రిసిపి .ఈ ఎగ్ మాసాల చాలా స్పైసీగా మంచి ఫ్లేవర్ తో ఉంటుంది. మరి మీరు కూడా ఈ స్పైసీ ఎగ్ మసాలాను టేస్ట్ చేయాలంటే, తయారుచేసే పద్దతిని తెలుసుకోవాల్సిందే...

కావల్సిన పదార్థాలు:
గుడ్లు-4 (ఉడికించినవి)
రోస్ట్ చేసిన వేరుశెనగ: 2tbsp
నువ్వులు: 2tbsp
కొబ్బరి తురుము: 1tbsp
జీలకర్ర: 1tsp
మెంతులు: ½tsp
ఎండు మిర్చి: 2
వెల్లుల్లి రెబ్బలు: 4(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
కరివేపాకు 10
పచ్చిమిర్చి: 2(మద్యలోకి కట్ చేయాలి)
జీలకర్ర: 1tsp
ధనియాల పొడి: 1tsp
పసుపు: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
చింతపండు పేస్ట్: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2tbsp
నీరు: 1cup
తయారుచేయు విధానం:
1. ఒక టేబుల్ స్సూన్ ఆయిల్ ను పాన్ లో వేసి వేడి చేయాలి. ఉడికించి పొట్టు తీసి పెట్టుకొన్న గుడ్లను అందులో వేసి, 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీ జార్ లో వేరుశెనగ, నువ్వులు, కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్ళు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, మెంతులు, కరివేపాకు, డ్రై రెడ్ చిల్లీ, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి వేసి మీడియం మంట మీద ఒక నిముషం వేయించుకోవాలి.
4. ఇప్పుడు అందులో మిక్సీలో పేస్ట్ చేసుకొన్న మసాలా ముద్దను పాన్ లో వేసి, మీడియం మంట మీద 5నిముషాలు వేయించుకోవాలి.
5. తర్వాత అందులో పసుపు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి మరో 5నిముషాలు వేయించుకోవాలి.
6. తర్వాత అందులోనే కొద్దిగా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి 5నిముషాలు మీడియం మంట మీద ఉడికిన తర్వాత, నూనెలో ఫ్రై చేసుకొన్న మిగిలిన పదార్థాలను మరియ చింత పండు పేస్ట్ ను వేసి మిక్స్ చేసి రెండు నిముషాలు ఉడకనివ్వాలి.
7. చివరగా గరం మాసలా వేసి మిక్స్ చేసి ఒక నిముషం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి వేగా సర్వ్ చేయాలి. ఎగ్ మసాలా రెడీ . ఇది జీర రైస్ కు అద్భుతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications