ఫిష్ అమృత్‌సరి

Fish Amritsari
కావలసిన పదార్థాలు:

చేప ముక్కలు: 500grms
సన్నగా తరిగిన అల్లం ముక్కలు: 20grms
తరిగిన పచ్చిమిర్చి: 20grms
కోడిగుడ్లు: 2
నూనె: కావలసినంత
మిరప్పొడి: 50grms
పసుపు: 10grms
ఆవనూనె: 10grms
శనగపిండి: 100grms
వాము: 15grms
అల్లంవెల్లుల్లి పేస్టు: 25grms
నిమ్మకాయ: 1
ఉల్లిపాయ: 1
కొత్తిమీర: కట్ట
ధనియాల పొడి: 20grms
గరం మసాలా పౌడర్: 20grms
జీలకర్ర పొడి: 20grms

తయారు చేయు విధానము:
1. ముందుగా చేపముక్కలను శుభ్రపరిచి అందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలిపి పక్కన ఉంచాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి, అల్లం ముక్కలు, కోడిగుడ్డు సొన, ఆవనూనె, మిరప్పొడి, పసుపు, ఉప్పు, వాము, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి తగినంత నీటితో మిశ్రమాన్ని కొంచెం జారుడుగా (మిశ్రమం చేప ముక్కలకు పట్టేటట్లు) చేసుకోవాలి. ఈ మిశ్రమంలో చేపముక్కలను వేసి కలిపి పక్కన ఉంచాలి.
3. ఇప్పుడు పాన్‌ లో నూనె వేడి చేసి అందులో చేప ముక్కలను డీప్ ఫ్రై చేయాలి. బాగా వేగిన చేపముక్కలను నూనెలో నుంచి తీసి ప్లేట్‌ లో సర్ది వాటి మీద ఉల్లిపాయముక్కలు, కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలను గార్నిష్ చేస్తే ఫిష్ అమృత్‌సరి రెడీ.

Story first published: Saturday, May 28, 2011, 15:50 [IST]
Desktop Bottom Promotion