Latest Updates
-
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
ఫిష్ దో ప్యాజ్ టేస్టీ బెంగాలీ రిసిపి
ఫిష్ కర్రీ లేనిదే బెంగాల్ మీల్స్ పూర్తి కాదు. ఫిష్ మరియు వివిధ రకాల మసాల దినుసులతో వివిధ రకాల వెరైటీలు తయారు చేయండంలో బెంగాలీలు సిద్దహస్తులు. బెంగాల్ లో లభించే వివిధ రకాల ఫిష్ లతో వివిధ రకాల వెరైటీలను తయారు చేయవచ్చు. అందులో ఒకటి ఫిష్ దో ప్యాజ్. చాలా రుచికరంగా ఉండే ఈ బెంగాల్ రిసిపి బెంగాలీల వంటకాల్లో చాలా ప్రసిద్ది చెందినది.
దీన్ని తయారు చేయడం చాలా సులభం. మరియు ఉల్లిపాయలను ఇందులో ఎక్కువగా వాడటం వల్ల ఈ కర్రీకి ఫిష్ దో ప్యాజ్ అంటారు. ఉల్లిపాయ ప్లేవర్, చిక్కటి గ్రేవీతో నోరూరించే ఫిష్ దో ప్యాజ్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం...

చేపలు: 500grms
నిమ్మరసం: 1tsp
ఉల్లిపాయలు: 3(స్లైస్ గా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
టమోటో గుజ్జు: 2tbsp
పసుపు: 1tsp
వెనిగర్: 1tsp
పెప్పర్ పౌడర్: 1/2tsp
గరం మసాలా: 1tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
మస్టర్డ్ ఆయిల్: 2tbsp
నీళ్ళు : 1cup
కొత్తిమీర తరుగు: 2tsp
తయారు చేయు విధానం :
1. ముందుగా చేపలను ఉప్పు, పసుపు వేసి బాగా శుభ్రంగా కడి పక్కన పెట్టుకోవాలి. తడి ఆరిన తర్వాత నిమ్మరసం, పసుపు, ఉప్పు మూడింటిని మిక్స్ చేసి చేపలకు పట్టించి 10-15నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేడి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అదే పాన్ లో మరి కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటో గుజ్జు వేసి మీడియం మంట మీద రెండు నిముషాలు వేగించుకోవాలి.
5. టమోటో గుజ్జు ఉడికిన తర్వాత అందులో వెనిగర్, రెడ్ చిల్లి పౌడర్, పసుపు, పెప్పర్ పౌడర్, గరం మసాలా పౌడర్, వేసి మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.
6. ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకూ వేగించుకొని, తర్వాత అందులో నీళ్ళు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. గ్రేవీ బాగా ఉడకనివ్వాలి.
7. తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న చేప ముక్కలను వేసి నిదానంగా గ్రేవీలో మునిగేట్లు చేసి మరో 5నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
8. ఐదు నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఫిష్ దో ప్యాజ్ రెడీ. వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications