Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
గీ వాలీ చికెన్ కర్రీ-నాన్ పులావ్ స్పెషల్
గీ వాలీ చికెన్ పేరులో ఉంది. ఈ చికెన్ కర్రీ టేస్ట్ ఏవిధంగా ఉంటుందో తెలుస్తుంది నెయ్యి లేదా ప్యూరిఫైడ్ బట్టర్ నాన్ వెజ్ వంటలకు వాడటం చాలా అరుదు. నెయ్యిని మరికొన్ని వేరే వంటల్లో ఉపయోగించడం వల్ల మంచి ఫ్లేవర్ ను కలిగిస్తుంది. అయితే చికెన్ కర్రీలో వేయడం వల్ల ఫ్లేవర్ మాత్రమే కాదు. మంచి టేస్ట్ కూడా ఉంటుంది.
ఈ చికెన్ కర్రీ కొరకు వివిధ రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తారు. ఈ మసాలా దినుసులు మన ఇండియన్ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ చికెన్ కర్రీకి ఎక్స్ ట్రాగా నెయ్యి మాత్రం చేర్చడం వల్ల అద్భతుమైను సువాసనతో పాటు మంచి టేస్ట్ ను కలిగి ఉంటుంది. దీన్ని పులావ్ మరియు నాన్ తో సర్వ్ చేస్తే చాలా టేస్టీ గా ఉంటుంది.
కావల్సిన పదార్థాలు:
చికెన్: 1/2kg(మీడయం సైజు ముక్కలు)
నెయ్యి: 1 cup(approximately 60 grams)
నిమ్మరసం: 2tbsp
ఉల్లిపాయలు: 2(chopped)
వెల్లుల్లి రెబ్బలు: 8
అల్లం: 1 చిన్నముక్క(finely sliced)
పచ్చిమిర్చి: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటో: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
జీలకర్ర: 1/2 tsp
బిర్యాని ఆకు: 1
చెక్క: చిన్న ముక్క
యాలకులు: 2
కారం: 1/2 tsp
జీలకర్రపొడి: 1tsp
గరం మసాలా: 1/2 tsp
మెంతులు లేదా ఎండిన మెంతిఆకులు: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1.ముందుగా చికెన్ ముక్కలను నిమ్మరసం మరియు ఉప్పు తో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వంటకు కావల్సిన పదార్థాలన్నింటిని కట్ చేసుకోవాలి.
2. తర్వాత అరకప్పు నెయ్యిని పాన్ లో వేసుకొని వేడి చేయాలి. తర్వాత అందులో బిర్యాని ఆకు, యాలకులు, చెక్క, మరియు జీలకర్ర వేసి వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి మరి కొద్దిసేపు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగగానే అందులో చికెన్ ముక్కలు వేయాలి.
4. చికెన్ ముక్కలను 5నిముషాల పాటు వేగించుకోవాలి .
5. తర్వాత చికెన్ ముక్కలు బ్రౌన్ కలర్ లోనికి మారగాని అందులో అల్లం, వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి వేసి, వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకూ వేగించుకోవాలి.
6. ఇప్పడు టమోటో ముక్కలు కూడా వేసి వేగించి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి మరియు గరం మసాలా పౌడర్ వేసి ఉడికించుకోవాలి.
7. ఈ మిశ్రమాన్నంతటినీ బాగా కలగలిపి మరో 5-10నిముషాల పాటు తక్కువ మంట మీదు వేగించుకోవాలి. తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి మరో పది నిముషాలు ఉడికించుకోవాలి.
8. చికెన్ ముక్కలు ఉడికేంత వరకూ మద్య మద్యలో కలియబెడుతూ పది నిముషాల తర్వాత మిగిన నెయ్యిని కూడా కరిగించి ఎండిన మెంతి ఆకులు ఆ నెయ్యిలో వేగించి, ఈ మిశ్రమాన్ని నెయ్యితో సహా ఉడుకుతున్న చికెన్ కర్రీలో కలుపుకోవాలి. అంతే గీ చికెన్ కర్రీ రెడీ దీన్ని పులావ్ మరియు నాన్ తో సర్వ్ చేస్తే చాలా టేస్టీ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications