Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
గోల్డెన్ ఫ్రైడ్ చికెన్ ఫింగర్స్

చికెన్(కండవున్న కోడి రెక్కలు): 6 (స్కిన్ లెస్, బోన్ లెస్, అర్థ ఇంచ్ పొడవుగా కట్ చేసినవి)
కోడిగుడ్డు: 1(పగలగొట్టినది)
పెరుగు: 1cup
వెల్లుల్లి: 2tsp
మైదా: 1cup
బ్రెడ్ పొడి: 1cup
ఉప్పు: రుచికి తగినంత
పెప్పర్ పౌడర్: 1tsp
బేకింగ్ పౌడర్: 1tsp
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానము:
1. ఒక ప్లాస్టిక్ బౌల్ లో పగులగొట్టిన ఎగ్ ను పగటగొట్టి అందులో వేయాలి. తర్వాత పెరుగు, వెల్లుల్లి పేస్ట్ మరియు ఉప్పు వేసి బాగా కలిపి అందులో కట్ చేసిన పెట్టుకొన్న చికెన్ ముక్కలు ఈ మిశ్రమంలో వేసి కలిపి మూడు గంటలపాటు రిఫ్రిజరేటర్ లో ఉంచాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు కొద్దిగా వేసి, నీళ్లుపోసి దోసెపిండిలా చిక్కగా,జాగురుగా కలుపుకోవాలి.
3. మూడు గంటల తర్వాత ఫ్రిజ్ లో పెట్టిన చికెన్ బయటకు తీసి చికెన్ ముక్కలను మైదా మిశ్రమంలో డిప్(ముంచి)చేసి తర్వాత బ్రెడ్ పొడిలో పొర్లించి వేడివేడిగా కాగే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ డీప్ ఫ్రై చేయాలి.
4. ఇలా ఫ్రై చేసిన చికెన్ ఫింగర్స్ ని పేపర్ టవెల్స్ పై వేసి డ్రై(నూనెను వత్తాలి)చేయాలి. తర్వాత వాటిపై పెప్పర్ పౌడర్ చల్లి సర్వ్ చేయాలి అంతే గోల్డ్ ఫ్రైడ్ చికెన్ ఫింగర్స్ రెడీ...



Click it and Unblock the Notifications