ఆదివారం ‘అదరగొడదామా’....!!

Gosht Masala
'' సందది.. సందడి ఆదివారాన్ని.. అదరగొట్టే ఘుమఘుమతో సెలబ్రేట్ చేసుకోవాలని ఉందా..?? బిల్లు పేలే రెస్టారెంట్ క్యాండిల్ లైట్ డిన్నర్ కు చెక్ పెట్టి.. అదే రుచిని సుకుటుంబ..సపరివారి సమేతంగా ఇంట్లో ఆస్వాదించాలని ఉందా..? అయితే మా ' స్పెషల్ ఆదివారపు వంటకాన్ని' అందుకోండి మరి...''

'గోస్ట్ మసాలా'.. పేరు భయంకరంగా ఉందని బెదిరిపోకండి... లొట్టలేసుకు తినే రుచిని కలిగిన ఈ హైదరబాదీ వంటకం దేశ వ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. 'నైజాం నవాబులు' కాలం నుంచి రూపాంతరం చెందుతూ వస్తున్న 'సుప్రసిద్ధ భాగ్యనగరి మటన్ వంటకం' కాలానుగుణంగా మార్పు చెందుతూ ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. రంజాన్ మాసంలో మహ్మదీయులు ఇష్టంగా ఆరగించే ఈ వంటకం కోస్తా, రాయలసీమ, తెలంగాణ, ఉత్తారాంధ్రాల్లో చెదురు మదరుగా దొరుకుతుంది. అయితే ఈ వంటకాన్నిఅతి సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందు కోసం అతిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యంగా బ్యాచిలర్స్, వీకెండ్ ఎంజాయ్ అంటూ రెస్టారెంట్లలో వందలకు వందలు బిల్లులు కట్టే బదులు తమ రూమ్ లోనే ఈ స్వయంపాకాన్ని తయారు చేసుకుంటే ' కొత్త వంటకాన్ని ట్ర్రై చేసామన్న ధ్రిల్ తో పాటు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.'..

గోస్ట్ మసలా తయారీకి కావల్సిన పదార్ధాలు:

- తాజా వేట మాంసం (మటన్) 500 గ్రాములు,
- పెరుగు 100 గ్రాములు,
- మిరియాలు 3 టేబుల్ స్పూన్లు,
- ఉల్లిపాయలు 2 (సన్నగా తరిగినవి),
- వెల్లులి 5 రెబ్బలు,
- అల్లం చిన్న చిన్న అరంగుళం ముక్కలు 5,
- పచ్చిమిరపకాయలు 4 సన్నగా (తరిగినవి),
- పెప్పర్ కార్న్స 10,
- లవంగాలు 5,
- ఏలుక్కాయలు 4.
- లవంగ పట్టు బద్దలు 2,
- జీలకర్ర 1టీ స్పూన్,
- పలావ్ ఆకు 1,
- కారం 1టీస్పూన్,
- జీలకర్ర పొడి 2 టీ స్పూన్లు,
- నూనె 4 టేబుల్ స్పూన్లు,
- సాల్ట్ తగినంత,

తయారు చేసుకునే విధానం:

- ముందుగా శుభ్రం చేసుకున్న మటన్, పెరుగు, కారం, జీలకర్ర పొడి, మిరియాలలో సాల్ట్ ను ఒక పాత్రలోకి తీసుకుని రెండు గంటలు పాటు నానబెట్టకోండి.

- పాత్ర నూనె పోసి వేడైన తరవాత పలావ్ ఆకు, జీలకర్ర, పెప్పర్ కార్న్, లవంగాలు, ఏలుకలు, లవంగపట్టు బద్దలను వేసి నిమిషం పాటు వేయించండి.

- అనంతరం సన్నగా తరిగిపెట్టకున్న ఉల్లిముక్కలను మెల్లగా పాన్ లోకి జారవిడువండి. అవి బంగారం రుంగులో వేగాక వెల్లులి రెబ్బలతో పాటు అల్లాన్ని వేసి రెండు నిమిషాల పాటు వేయించండి.

- నానబెట్టిన మిశ్రమాన్ని పాన్ లో వేసి మిశ్రమం కలిసే లాగా గరెటితో తిప్పండి. 8 నిమిషాలు పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించిన తరువాత, ప్రెషర్ కుక్కర్‌లోకి మార్చండి. ఈ మిశ్రమానికి రెండు కప్పుల నీటిని జోడించి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి.

మీరు శ్రమించి తయారుచేసిన 'గోస్ట్ మషాలా' తయార్, ఈ వేడి, వేడి మాషాలాను అన్నంలోగాని, బిర్యానిలోగాని కలుపుకుని తింటే ఆ రుచే వేరు, ఇంకెందుకండి ఆలస్యం తయారీ విధానం తెలుసుకున్నారుగా ఒక సారి ట్రై చేస్తే పోలా...

Story first published: Sunday, August 28, 2011, 12:43 [IST]
Desktop Bottom Promotion