Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
హాట్... హాట్ గ్రిల్డ్ హనీ చికెన్

వైట్ వెనిగర్: 1/4cup
ఆలివ్ నూనె: 1/4cup
చికెన్ : 1/2kg
ఉప్పు: రుచికి సరిపడా
మిరియాలు పొడి
తేనె: 1/2cup
నీళ్ళు: కొద్దిగా
తాజా పుదీనా ఆకుల తరుగు: 1/2cup(మరియు 2tbspఎండిన పుదీనా ఆకులు)
తయారు చేయు విధానం:
1. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శుభ్రం చేసిన చికెన్ ముక్కలు, వైట్ వెనిగర్, ఆలివ్ నూనెను ఒక దాని తర్వాత ఒకటి చికెన్ ముక్కల మీదు పోయాలి. చికెన్ ముక్కలను పైకి క్రింది తిప్ప బాగా తిప్పాలి. అప్పుడే వైట్ వెనిగర్ మిశ్రమం చికెన్ ముక్కలను బాగా పట్టి రుచిగా ఉంటాయి. ఇలా మిక్స్ చేసి పెట్టుకొన్న చికెన్ కనీసం ఒక గంట నుండి రెండు గంటల పాటు బాగా నాననివ్వాలి.
2. మరో చిన్న బౌల్ తీసుకొని అందులో తేనె, పుదీనా, కొద్దిగా నీళ్ళు, వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఓవెన్ లో కానీ లేదా ఓపెన్ పద్దతిలో గ్రిల్ ను తక్కువ మంట మీద బాగా వేడెక్కించాలి. తర్వాత ముందుగా వెనిగర్ లో మ్యారినేట్ (నానబెట్టి)చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను తీసి దాని మీద పెప్పర్ పౌడర్, తగినంత ఉప్పును చిలకరించాలి.
4. ఇలా అన్ని చికెన్ ముక్కల మీదు పెప్పర్ చల్లి పెట్టుకొన్నాక, వేడి అవుతున్న గ్రిల్ మీదు చికెన్ ముక్కలను పెట్టుకోవాలి.
మీడియం మంట మీద గ్రిల్ వేడెక్కేట్టు చేస్తూ చికెన్ ను రెండు వైపులా తిప్పిస్తూ కనీసం అరగంట పాటు చికెన్ బాగా బేక్ చేసుకోవాలి.
5. ఇలా బేక్ చేస్తున్న చికెన్ ముక్కలను చివర ఐదు -పదినిమిషాల ఉందనంగా వాటి మీద హనీ, మింట్ మిశ్రమాన్నిమిక్స్ చేయాలి. మరో రెండు మూడు నిమిషాల బేక్ చేసి, క్రిందికి దింపుకొని హాట్ హాట్ గా హనీ చికెన్ సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications