గ్రిల్డ్ సాల్మన్ : ఇండియన్ స్టైల్ రిసిపి

సాధారణంగా చేపల్లో వివిధ రకాలు ఉంటాయి. వాటిలో లోఫ్యాట్, ఫ్యాట్ కలిగిన చేపలు కూడా ఉన్నాయి. లోఫ్యాట్ కలిగిన, ఆరోగ్యానికి మేలు చేసే ఒక మంచి చేప సాల్మన్ చేపలు. ఇవి మంచి రుచితో పాటు, ఆరోగ్యానికి కూడా అధిక ప్రయోజనాలను కలిగిస్తాయి.

ఈ సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దాంతో ఇవి రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ప్రయోజనం అని భావిస్తారు. ఈ సాల్మన్ ఫిష్ తో ఎక్కువగా ఫ్రై లేదా గ్రిల్ చేసి తీసుకుంటారు . గ్రిల్ట్ ఫిష్ కు చాలా తక్కువ సమయం పడుతుంది. సాల్మన్ ను గ్రిల్డ్ చేయడం వల్ల అందులో విటమిన్స్ మరియు మినిరల్స్, అవసరమయ్యే పోషకాలు అందుతాయి. వీటిలో ఉన్న విటమిన్స్,మినిరల్స్, పోషకాలు మరే ఇతర మాంసం, కూరగయాలు, పండ్లలో ఉండవు . మరి అటువంటి అద్భుత గుణాలున్నా ఈ సాల్మన్ ఫిష్ ను ఎలా గ్రిల్డ్ చేసి, మన ఇండియన్ స్టైల్లో తయారు చేయాలో క్రింది విధంగా చూద్దాం...

Grilled Salmon: Indian Style Recipe

కావలసిన పదార్థాలు:
సాల్మన్ ఫిష్: 1/2kg
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 2tbsp
వెనిగర్: 1/2tsp
నిమ్మ రసం: 3tbsp
పెరుగు: 2tbsp
కారం: 2tbsp
ఆలివ్ ఆయిల్:2tbsp
మిరియాలపొడి: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:

1. ముందుగా సాల్మన్ ఫిష్‌ ను ముళ్లు లేని విధంగా ముక్కలుగా కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా శుభ్రం చేసి నీళ్ళతో కడగాలి.
2. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టే, నిమ్మరసం, ఉప్పు, వెనిగర్, కారం వేసి బాగా మిక్స్ చేసి సాల్మన్ ఫిస్ ముక్కలకు బాగా రెండు వైపుల రాసి రెండు లేదా మూడు గంటలపాటు ఫ్రిజ్ లో పెట్టాలి.
3. రెండు మూడు గంటల తర్వాత బయటకు తీసి వాటిని గ్రిల్ మీద పరిచి, వాటి మీద కొద్దిగా ఆలివ్ ఆయిల్ చిలకరించి ఓవెన్ లేదా స్టౌ మీదా గ్రిల్స్ సెట్ చేసుకొని బాగా కాలనివ్వాలి.
4. రెండు వైపు కూడా తిప్పి బ్రౌన్ కలర్ వంచేంత వరకూ బాగా కాలనిచ్చి సర్వింగ్ ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ఈ చేపముక్కలకు కొద్దిగా వెన్న రాసి, ఉల్లిపాయ, నిమ్మ చెక్కతో సర్వ్ చేయాలి అంతే గ్రిల్డ్ సాల్మన్ ఫిష్ ఇండియన్ స్టైల్లో రెడీ.

Story first published: Wednesday, December 4, 2013, 12:04 [IST]
Desktop Bottom Promotion