Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
హెల్తీ చికెన్ సాలడ్ : ఇండియన్ స్టైల్ రిసిపి
లోఫ్యాట్ చికెన్ సలాడ్ చాలా రుచికరమైనది . అంతే కాదు చాలా పుష్టికరమైనది కూడా. ఈ సలాడ్ తయారు చేయడం చాలా సులభం. కొన్ని మసాలాలు పట్టించడంతో వండర్ ఫుల్ బ్యాలెన్డ్స్ ఫేవర్స్ తో నోరూరిస్తుంటుంది.
ఇది ఒక బహుముఖ డిష్ ఎందుకంటే దీన్ని భోజనం లేదా డిన్నర్ కు ఏసమయంలోనైనా తినవచ్చు. అంతే కాదు ఈ సలాడ్ వేడిగానూ లేదా చల్లగానూ రెండు రకాలుగాను తినవచ్చు. ఇది శక్తిని కూడా అందిస్తుంది. ఈ చికెన్ సలాడ్ తక్కువ ఫ్యాట్ మరియు అధిక పోషకాంశాలు కలిగి ఉంటుంది. మరి ఈ లోఫ్యాట్ చికెన్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
చికెన్: 150 gmr(చిన్న ముక్కలుగా కట్ చేసి, ఉడికించి పెట్టుకోవాలి)
క్యారెట్: 1(ముక్కలుగా చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
బంగాళదుంప: ½(ఉడికించి, తరిగిపెట్టుకోవాలి)
పాలకూర: 5 -6ఆకులుః
మయోనైజ్( Mayonnaise):1tbsp
ఉప్పు రుచికి సరిపడా
మసాలా కోసం:
గరం మసాలా: ¼tbsp
జీలకర్ర పొడి: ¼tbsp
కారం పొడి: ¼tbsp
మెంతులు పొడి: ఒక చిటికెడు
పసుపు : ఒక చిటికెడు
తయారుచేయు విధానం:
1. ముందుగా మసాలా కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని తీసుకొని కొద్దిగా నీరు మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. ఒకసారి వాటన్నింటిని మిక్స్ చేసిన తర్వాత చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను 20నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
2. అంతలోపు ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్, ఉల్లిపాయ, టమోటో, బంగాళదుంప మరియు లెట్యూస్ ఆకులు వేయాలి. మొత్తం బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు, పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి వేడిచేయాలి. అందులో మ్యారినేట్ చికెన్ వేసి రెండు నిముషాలు ఉడికించుకోవాలి. ఆరోమా వాసన వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
4. తర్వాత బౌల్లో చికెన్ ముక్కలు వేసి , తర్వాత మోయోనైజ్, మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి దాని వల్ల మీకు మంచి టేస్ట్ గా అనిపిస్తుంది మరియు హెల్తీ కూడా...



Click it and Unblock the Notifications