Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
హాట్ అండ్ స్పైసీ చికెన్ మంచూరియన్

బోన్ లెస్ చికెన్: 500grm
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
పసుపు: 1/4tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
పెరుగు: 1/2cup
టేస్టింగ్ సాల్ట్: చిటికెడు
కార్న్ ఫ్లౌర్: 3tbsp
టమాటో సాస్: 2tbsp
చిల్లి సాస్: 1tsp
సోయా సాస్: 2tbsp
వెల్లుల్లి ముక్కలు: 2tbsp
పచ్చిమిర్చి ముక్కలు: కొద్దిగా
కొత్తిమీరతరుగు: 1/2cup
నూనె: సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ని సుబ్బరంగా కడిగి మీడియం సైజులో కట్ చేసుకొని అందులో ఉప్పు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లౌర్ , ఆల్ పర్పస్ ఫ్లౌర్, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కొద్దిగా నీరు పోసి బాగా చికెన్ అంతా కలిసేలా కలిపి ఒక గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి.
2. గంట తరువాత ఫ్రిజ్ లో పెట్టిన చికెన్ ని తీసి స్టౌవెలిగించి బాణలి పెట్టి చికెన్ ముక్కలు మునిగేలా నూనె పోసి బాగా వేడేక్కకా అందులో చికేన్ ముక్కలు వేసి బాగా కరకర లాడేలా వేపుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
3. తరువాత మళ్ళీ స్టౌ మీద ఇంకో బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో వేయించుకున్న చికేన్ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చిల్లి సాస్, టమాటో సాస్, సోయా సాస్, పెరుగు, టేస్టింగ్ సాల్ట్ , పెప్పెర్ కార్న్, చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా కలిసేలా కొద్దిగా వేయించుకొని కొత్తిమీరతో చక్కగా అలంకరించుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే నోరూరించే చికేన్ మంచూరియన్ రెడీ.



Click it and Unblock the Notifications