హైదరాబాదీ బిర్యాని

Hyderabadi Biryani
కావలసిన పదార్ధాలు:

మాంసం - 1 kg
బాస్మతీ బియ్యం - 1 kg
ఉల్లిపాయలు -250 grms
పెరుగు - 250 grms
అల్లం వెల్లుల్లి ముద్ద - 3 tsp
కొత్తిమిర - 1/2 cup
పుదీన - 1/2 cup
పచ్చిమిర్చి - 3
పసుపు - తగినంత
కారం పొడి - 2 tsp
ఏలకులు - 4
లవంగాలు - 8
దాల్చిన - 2
షాజీర - 2 tsp
గరం మసాలా పొడి - 2 tsp
కేసర్ రంగు - 1/4 tsp
పాలు - 1 cup
ఉప్పు తగినంత
నూనె - తగినంత

తయారు చేయు విధానం:

ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి పెట్టుకోవాలి. అలాగే తరిగిన కొత్తిమిర ,పుదీనా కూడా. కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించిన ఉల్లిపాయ,కొత్తిమిర,పుదీనా,పెరుగు,కారంపొడి, పసుపు,మాంసానికి తగినంతఉప్పు వేసి మిక్సిలో మెత్తగా ముద్ద చేసుకొనిపెట్టుకోవాలి. ఒక గిన్నెలో శుభ్రపరచిన మాంసం, నూరిన ముద్ద, పచ్చి కొత్తిమిర, పుదీనా, పచ్చిమిరపకాయలు,గరం మసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంట నాననివ్వాలి. బియ్యం కడిగి పదినిమిషాలు నాననిస్తే చాలు. మందపాటి గిన్నె తీసుకొని నూనె వేసి దానిమీద నానబెట్టిన మాంసం, మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకోవాలి. ఇంకో పెద్ద గిన్నెలో బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసి అన్నానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరిగేటప్పుడు ఏలకులు,లవంగాలు,దాల్చిన చెక్క ముక్కలు, షాజీర వేయలి. బియ్యంలోని నీరంతా వడకట్టాలి. మరుగుతున్న నీటిలో ఈ బియ్యం వేసి సగం ఉడకగానే గంజి వార్చి తర్వాత సగం ఉడికిన అన్నంను మాంసంపై సమానంగా పరవాలి.పైన కొన్ని ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమిర, పుదీనా కొద్దిగా, నెయ్యి, పాలు, కేసర్ రంగు వేసి, తడిపిన గోధుమపిండిని చుట్టలాగా చేసుకుని గిన్నె అంచులపై మొత్తం పెట్టి దానిమీద సమానమైన మూత పెట్టాలి. పొయ్యిమీద ఇనప పెనం పెట్టి వేడి చేసి దానిపై ఈ గిన్నె పెట్టి దాని మీద బరువైన ఎదైనా వస్తువు పెట్టాలి. దీనివల్ల ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. అరగంట తర్వాత ఇది తయారై గోధుమ పిండిని చీల్చుకుని ఆవిరి బయటకొస్తుంది ఘుమఘుమలతో. ఉడికించిన గ్రుడ్లతో అలంకరించుకోవాలి.దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి, గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటాయి.

Story first published: Monday, November 2, 2009, 17:31 [IST]
Desktop Bottom Promotion