Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
హైదరాబాద్ చికెన్ 65 బిర్యాని-స్పెషల్ టేస్ట్
బిర్యానీ అంటే మొదట గుర్గు వచ్చేది మన ఇండియాలో హైదరాబాదే. మన భారతదేశంలోనే బిర్యానీ తినాలంటే మాత్రం హైదరాబాదా రావాల్సిందే...బిర్యానీ, మైదరాబాద్ ఒకే సంస్కృతికి రెండు పేర్లు. మిర్చీకా సాలన్, పెరుగు పచ్చడి, మీటా పాన్, డబుల్ కా మీఠా.. ఇవన్నీ బిర్యానీకి అదనపు రుచులు అందిస్తాయి.
అంతే కాదు, రాజులు, మహారాజులు, సామాన్యులు -...ఇలా ఎవరైనా సరే హైదరాబాద్ బిర్యానీకి తలవంచి సలామ్ చెయ్యాల్సిందే. మరి బిర్యానీ ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా స్పెషల్ గా తయారు చేసుకుంటే ఆ మజాయే వేరు. సాధారణంగా మనం చికెన్ 65 తింటుంటాం. అలాకాకుండా చికెన్ 65తో తయారుచేసే బిర్యానీ మరింత టేస్టీగా ఉంటుంది. మరి దీన్నీ రుచి చూడాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఒక సారి చూద్దాం..

చికెన్ ఫ్రైకి కావల్సిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్: 1kg
టమోటో సాస్: 2tbsp
చిల్లీ సాస్: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
గుడ్డు తెల్లసొన: 1
కార్న్ ఫ్లోర్: 1tbsp
కేసరి కలర్ : చిటికెడు
తయారు చేయడం: శుభ్రంగా కడిగిపెట్టుకొన్న చికెన్ ముక్కలకు ఇవ్వన్నీ పట్టించి ఫ్రై చేసి పెట్టుకోవాలి.
చికెన్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు
సన్నగా తరిగిన వెల్లుల్లి: 2tbsp
నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి: 6
కరివేపాకు : 2 రెమ్మలు
సోయాసాస్: 1tsp
పెరుగు: 1cup
చికెన్ 65 తయారు చేయడం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన వెల్లుల్లి ముక్కలను వేసి కొద్దిగా ఫ్రై చెయ్యాలి.
2. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరికాస్త సేపు ఫ్రై చేయాలి.
3. ఇప్పుడు దీనికి డీప్ ఫ్రై చేసిన చికెన్ ముక్కలు, పెరుగు కలిపి కాసేపు చిన్న మంట మీద ఉంచితే చికెన్ 65 రెడీ.
బిర్యానీ తయారి:
1. ఒక గిన్నె తీసుకొని ముందు చెప్పినట్లు మ్యారినేట్ ను వేసి దాని మీద సగం ఉడికిన అన్నాన్ని వెయ్యాలి.
2. దాని మీద ఈ చికెన్ ముక్కలను వేసి దమ్ మీద ఉడికిస్తే చికెన్ 65బిర్యానీ రెడీ అయినట్లే...



Click it and Unblock the Notifications