హైదరాబాద్ దమ్ కా చికెన్ కబాబ్

Hyderabadi Dum Ka Chicken Kebab
ఇంట్లో చేసే చికెన్ కబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి, వాటిని ఎంత ఇష్టపడినా ఇంట్లోచేయడం తక్కువే. మారినేషన్ తయారు చేసుకుంటే చాలు సింపుల్ గా అయిపోతుంది. రుచి అద్భుతంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
చికెన్: 1kg
పెరుగు: 1cup
బాదం పప్పు: 50grm
మిరియాలు: 1tsp
ఎండు కొబ్బరి: 1/4cup
పచ్చిమిరపకాయలు: 6-8
కొత్తిమీర తురుము: 1cup
ఉల్లిపాయ ముక్కలు: 1/2cup
గరంమసాల: 1tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tsp
కారం: 1tsp
పసుపు: చిటికిడి
ఉప్పు: రుచికి తగినంత
కబాబ్ చిని: 8
నెయ్యి: 2tbsp
నూనె: సరిపడా.

తయారు చేయు విధానం:
1. ఒక గిన్నెలో అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, ఉప్పు, కారం, గరం మసాల, కబాబ్ చిని పొడి వేసి బాగా కలపాలి. అందులో చికెన్ వేసి బాగా కలిపి అరగంట పాటు నానపెట్టాలి.
2. తర్వాత మిక్సీ గిన్నెలో బాదం పప్పులు, జీడిపప్పు, మిరియాలు, ఎండుకొబ్బరి రుబ్బుకోవాలి. ఇందులో పెరుగు, పచ్చిమిరపకాయలు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో అల్లంవెల్లుల్లిలో నానిన చికెన్‌ ని వేసి మరో పావుగంట నానపెట్టాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, సరిపడా నూనె పోసి వేడెక్కాక చికెన్‌ తో పాటు మిగిలిన మిశ్రమాన్ని కూడా వేసి బాగా వేగించాలి. ఉప్పు, కారం, గరంమసాల వేసి ఓ పావుగంటసేపు ఉడికించాలి. ముక్క మెత్తపడ్డాక దించేసి కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

Story first published: Wednesday, March 7, 2012, 17:19 [IST]
Desktop Bottom Promotion