Latest Updates
-
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి! -
తొలి జాబ్‌లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ! -
టెస్టుల అవసరం లేకుండానే మీలో ఫెర్టిలిటీ సమస్య లేదని తెలిపే 5 సంకేతాలు.!
అమ్మని మించిన దైవం లేదు..ఈ మదర్స్ డేకి మీ అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పించే విషెస్ ఇవే..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారం రోజున మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మదర్స్ డే ఆదివారం(మే 10, 2026)జరుపుకుంటున్నాం. తల్లి ప్రేమ, త్యాగం, సహనానికి గుర్తింపుగా మదర్స్ డే జరుపుకుంటారు. పిల్లల జీవితాలను తీర్చిదిద్దడంలో, సమాజాన్ని నిర్మించడంలో మాతృమూర్తుల పాత్ర అనన్యమైనది. అన్నా జార్విస్ అనే మహిళ తన తల్లి జ్ఞాపకార్థం ఈ రోజును అధికారికంగా ప్రారంభించేలా కృషి చేశారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ బహుమతులు, గ్రీటింగ్స్ ఇస్తారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా మన తల్లుల ముఖంలో చిరునవ్వు తెప్పించేలా ఎలా విష్ చేయాలో ఇక్కడ చూడండి.

మదర్స్ డే విషెస్ ఇలా చెప్పండి
-మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా. నీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
-దేవుడు అంతటా ఉండలేక అమ్మను సృష్టించాడు. నా దేవతకు హ్యాపీ మదర్స్ డే.
-నా ప్రపంచం, నా సర్వస్వం నువ్వే అమ్మా. హ్యాపీ మదర్స్ డే 2026.
-అమ్మ అనే రెండక్షరాలే నా జీవితానికి ఆధారం. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
-నాకు జన్మనిచ్చినందుకు, ఇంతటి అందమైన జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు అమ్మా. హ్యాపీ మదర్స్ డే.
-నువ్వు లేని నా జీవితాన్ని ఊహించలేను. లవ్ యూ అమ్మా. హ్యాపీ మదర్స్ డే 2026.
-ఎన్ని జన్మలెత్తినా నీ కడుపునే పుట్టే అదృష్టం నాకు కావాలి. మదర్స్ డే శుభాకాంక్షలు.
-నా ప్రతి అడుగులో, ప్రతి విజయంలో నీ దీవెన ఉంది. థాంక్యూ అమ్మా.
-సృష్టిలో తియ్యనైనది అమ్మ ప్రేమ మాత్రమే. మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు.
-కల్మషం లేని ఏకైక ప్రేమ కన్నతల్లి ప్రేమ. హ్యాపీ మదర్స్ డే.
-నిస్వార్థానికి నిలువెత్తు రూపం నా అమ్మ. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
-నా జీవితంలో నేను చూసిన మొదటి అద్భుతం నువ్వే అమ్మా. హ్యాపీ మదర్స్ డే.
-నీ చిరునవ్వే నా బలం. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు అమ్మా. హ్యాపీ మదర్స్ డే.
-అమ్మంటే అంతులేని అనురాగం. మదర్స్ డే శుభాకాంక్షలు.
-నా బాధను తన బాధగా భావించే నా అమ్మకు హ్యాపీ మదర్స్ డే.
-నన్ను నన్నుగా ప్రేమించే ఏకైక వ్యక్తి నా అమ్మ. శుభాకాంక్షలు తల్లీ.
-అమ్మ పదాన్ని మించిన మంత్రం లేదు. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

మదర్స్ డే మెసేజ్ లు ఇలా..
-అమ్మా, నేను చేసే ప్రతి పనిలో నీ స్ఫూర్తి ఉంది. నీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ రక్షగా ఉంటాయి. హ్యాపీ మదర్స్ డే.
-నువ్వు పడ్డ కష్టాల వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నీ త్యాగాలకు కోటి ప్రణామాలు అమ్మా.
-గర్భంలో నవమాసాలు మోసి, భూమి మీద పడ్డాక జీవితకాలం మోసే అద్భుతమైన ప్రాణివి నువ్వు. లవ్ యూ అమ్మా.
-మాటలు రాని వయసులో నా ఆకలిని గుర్తించిన నీ ప్రేమకు ఎన్నటికీ వెలకట్టలేను. హ్యాపీ మదర్స్ డే.
-అమ్మా, నువ్వు నాకు దేవుడిచ్చిన గొప్ప వరం. నీ పెంపకం వల్లే నేను మంచి మనిషిగా ఎదిగాను.
-నా కన్నీరు తుడిచి, నా పెదవులపై చిరునవ్వు తెచ్చే మాయాజాలం నీకు మాత్రమే తెలుసు. థాంక్యూ అమ్మా.
-నా ప్రతి తప్పును మన్నించి, నన్ను సరైన దారిలో నడిపించిన నా మొదటి గురువుకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
-జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా, నీ ధైర్యం చూసి నేను ముందుకెళ్తున్నాను. నువ్వే నా రోల్ మోడల్.
-అమ్మా, నీ ఒడిలో ఉన్నంత ప్రశాంతత ఈ ప్రపంచంలో మరెక్కడా దొరకదు. హ్యాపీ మదర్స్ డే.
-నా విజయాలకు కారణం నీ ప్రోత్సాహమే. నాకంటే నా గురించి ఎక్కువగా ఆలోచించే నా తల్లికి శుభాకాంక్షలు.
-నువ్వు నా జీవితంలో లేకపోతే నా ఉనికి శూన్యం. ఎప్పటికీ నాతోనే ఉండు అమ్మా.
-ప్రేమ అనే పదానికి సరైన అర్థం చెప్పింది నీ జీవితమే అమ్మా. హ్యాపీ మదర్స్ డే.
-ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు, కానీ అమ్మ ప్రేమ మాత్రం ఎప్పటికీ చెరగనిది, తరగనిది.
-నా సంతోషం కోసం నీ కోరికలను వదులుకున్నావు. నీ త్యాగాలు అమూల్యం. హ్యాపీ మదర్స్ డే.
-నిన్ను చూసిన ప్రతిసారీ నాకు ఒకటే అనిపిస్తుంది.. దేవుడు నిజంగా ఉన్నాడని. హ్యాపీ మదర్స్ డే.
-అమ్మా, నీకు నేను ఇవ్వగలిగే అతిపెద్ద బహుమతి నా ప్రేమే. హ్యాపీ మదర్స్ డే 2026.
-ఎన్ని ఆస్తులు సంపాదించినా, అమ్మ ఆశీర్వాదం ముందు అన్నీ తక్కువే. హ్యాపీ మదర్స్ డే 2026.
-ప్రపంచాన్ని జయించిన వాడైనా, అమ్మ ఒడిలో సేదతీరాల్సిందే. మాతృమూర్తికి నమస్కారం.
-నా కోసం నీ నిద్రను, విశ్రాంతిని త్యాగం చేసిన నా అద్భుతమైన తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు.

మదర్స్ డే కోట్స్ ఇలా..
-అమ్మ ప్రేమకు మరణం లేదు, అమ్మ త్యాగానికి బదులు లేదు.
-సృష్టిలో అన్ని బంధాలు మన అవసరాన్ని బట్టి వస్తాయి, కానీ ఎలాంటి అవసరం లేకుండా వచ్చే ఒకే ఒక్క బంధం అమ్మ.
-నవమాసాలు మోసి, తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చే దేవతే అమ్మ.
-దేవుడు గుడిలో ఉంటాడు, కానీ అమ్మ మన ఇంట్లోనే ఉండే దేవుడు.
-అమ్మంటే ఓ అక్షరం కాదు, అది ప్రాణం పోసే ఓ పవిత్ర గ్రంథం.
-గెలిచినప్పుడు ప్రపంచం కౌగిలించుకుంటుంది, కానీ ఓడినప్పుడు కౌగిలించుకునేది అమ్మ మాత్రమే.
-అమ్మ చేతి ముద్దలో ఉన్న అమృతం, ఫైవ్ స్టార్ హోటల్ భోజనంలో కూడా దొరకదు.
-తన బిడ్డ ఆకలిని, కన్నీటిని చూడకముందే గ్రహించే శక్తి అమ్మకు మాత్రమే ఉంటుంది.
-అమ్మ అనే పదం పలకగానే మనసుకు కలిగే ప్రశాంతత మరే మంత్రం చదివినా దొరకదు.
-అమ్మ కోపం వెనుక కూడా అంతులేని ప్రేమ దాగి ఉంటుంది.
-ఈ ప్రపంచంలో స్వార్థం లేని ఏకైక వ్యక్తి తల్లి మాత్రమే.
మదర్స్ డే స్టేటస్ లు
-నా మొదటి గురువు, నా ప్రాణదాత..నా అమ్మ. హ్యాపీ మదర్స్ డే.
-ప్రపంచంలోని బెస్ట్ అమ్మ నాదే. మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మా.
-నా ప్రతి శ్వాసలో అమ్మ ప్రేమ దాగి ఉంది. లవ్ యూ అమ్మా.
-సృష్టికి మూలం అమ్మ.. నా ప్రాణానికి ఆధారం అమ్మ. హ్యాపీ మదర్స్ డే.
-అమ్మ అంటే భయం కాదు, భక్తి.. కోపం కాదు, ప్రేమ. హ్యాపీ మదర్స్ డే.
-నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. నువ్వు నాకు అమ్మగా దొరికావు. హ్యాపీ మదర్స్ డే.
-ఎన్ని జన్మలకైనా నువ్వే నా అమ్మ కావాలి. హ్యాపీ మదర్స్ డే.
-అమ్మ తోడుంటే ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చు.
-నా స్మైల్ వెనుక ఉన్న సీక్రెట్ నా అమ్మే. హ్యాపీ మదర్స్ డే 2026.



Click it and Unblock the Notifications