Latest Updates
-
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
కళా మసాలా చికెన్ కర్రీ
సాధారణంగా తయారు చేసుకొనే చికెన్ కర్రీకి కొత్త టేస్ట్ ను జోడించడం ఎలా అనుకుంటున్నారా?అందుకు మీకు సహాయపడే ఒక వంటకం ఉంది. కళా మసాలాతో తయారు చేసే చికెన్ కర్రీ మహారాష్ట్రలోని కాందేశ్ ప్రాంతంలో వండుకొని ఒక రుచికరమైన వంటకం. ఇది అక్కడ చాలా ఫేమస్.
కళా లేదా బ్లాక్ మసాలా వల్ల ఈ వంటకానికి అంత రుచి వచ్చింది. కళా మసాలను ఒక ప్రత్యేకమైన సువాసన మసాలా దినుసులు మరియు ఎండు కొబ్బరితో తయారు చేయబడింది. ఈ చికెన్ రిసిపి చాలా సులభం మరియు దీన్ని తయారు చేయడానికి కష్టపడాల్సిన పనిలేదు. మరి స్పైసి చికెన్ కరీ ఎలా తయారు చేయాలో చూద్దామా..

కావల్సిన పదార్థాలు:
చికెన్: 500grms
ఉల్లిపాయలు: 2(కట్ చేసినవి)
టమోటో: 1
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tbsp
కొత్తిమీర తరుగు: 1cup
పసుపు: 1tsp
నూనె: 3tbsp
కాలా మసాలా కోసం:
ఎండుకొబ్బరి: 3tbsp(తురుము)
సోంపు గింజలు: 2tbsp
లవంగాలు: 15
కబాబ్ చిని(మసాలా పొడి): 4
బ్లాక్ జీర: 1tbsp
బిర్యానీ ఆకు: 2
గసగసాలు: 2tbsp
బ్లాక్ పెప్పర్: 15
యాలకులు: 3
చెక్క: చిన్న ముక్క
తయారు చేయు విధానం:
1.పాన్ వేడి చేసి, అందులో కాలా మసాలకు సిద్దం చేసుకొన్న వస్తువులన్నింటిని వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
2. వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తని పౌడర్ గా తయారు చేసుకోవాలి. ఈ పౌడర్ ను మూత గట్టిగా ఉండే డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
3. తర్వాత చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు చికెన్ కు ఉప్పు, పసుపు రాసి, 15నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో కొద్దిగా ఉల్లిపాయలు వేసి 4-5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి.
6. తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల కాలా మసాల పౌడర్ ను కూడా వేసి బాగా మిక్స్ చేసి, మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
7. తర్వాత అందులోనే టమోటో ముక్కలు, కారం, ఉప్పు, వేసి ఐదునిముషాలు వేగిన తర్వాత అందులో చికెన్ ముక్కలు వేసి, మసాలాతో బాగా మిక్స్ చేసి ఒక కప్పు నీళ్ళు పోసి మిక్స్ చేయాలి.
8.మూత పెట్టి తక్కువ మంట మీద 10నిముషాలు ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికిందని నిర్ధారించుకొన్న తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగు వేసి, స్టౌ ఆఫ్ చేసేయాలి.
అంతే కళ మసాలా చికెన్ కర్రీని ఉడికించిన అన్నంతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications