Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై-సూపర్ టేస్ట్
ఫిష్ ఫ్రై తయారు చేయడం చాలా సులభం. అది మలబార్ తీరంలో వండే ఫిష్ ఫ్రైలు చాలా వెరైటీ రుచులకు పర్యాటకులను అలరిస్తుంటుంది. అక్కడికి వెళ్ళ పర్యాటకుల ఇలాంటి రుచులును చాలా ఇష్టంగా తింటుంటారు. కేరళ స్పెషల్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనెతో తయారు చేసి వారి స్టైల్ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ ఫ్రైకి సౌత్ ఇండియన్ స్పైసీతో మ్యారినేట్ చేసి , ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల రుచి అద్భుతం. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అటువంటి రుచిని మనం ఇట్లో తయారు చేసుకొనొ మలబార్ రుచులను ఆస్వాదిద్దాం....

కావలసిన పదార్థాలు:
ఫిష్ ఫిల్లెట్: 8(కింగ్ ఫిష్ లేదా అదే సైజులో ఉన్న మరేదైన ఫిష్)
అల్లం: చిన్న ముక్క
వెల్లుల్లి: 8-10పాయలు
పచ్చిమిర్చి: 4-5
కారం: 1tsp
పసుపు: చిటికెడు
బ్లాక్ పెప్పర్: 1tsp
కరివేపాకు: 1రెమ్మ
నిమ్మరసం: 2tbsp
కొబ్బరినూనె: 2tbsp
ఉల్లిపాయలు: 1(చిన్న చక్రల్లా కట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా శుభ్రం చేసి ప్లేట్ లో పెట్టి తడి ఆరనివ్వాలి.
2. తర్వాత చేపముక్కల మీద ఉప్పు, మరియు నిమ్మరసం వేసి బాగా రుద్దాలి. తర్వాత చేపలమీద కరివేపాకు వేసి కొద్దిసేపు అలాగే ఉంచడం వల్ల ఆ సువాసన చేపలకు బాగా పడుతుంది.
3. అంతలోపు మిక్సీలో అల్లం, వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి, కారం, పెప్పెర్, మరియు పసుపు వేసి బాగా మెత్తగా, చిక్కగా పేస్ట్ తయారు చేసుకోవాలి.
4. తర్వాత చేపలకు ఈ మసాలా మిశ్రమాన్ని బాగా పట్టించాలి. అన్నివైపులా బాగా పట్టించి అర గంట పాటు ఫ్రిజ్ లో పెట్టేయాలి.
5. అరగంట తర్వాత ఒక ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి , నూనె వేయాలి. నూనె వేడెక్కాక అందులో మసాలా పట్టించి పెట్టుకొన్న చేపముక్కలను ఫ్రైయింగ్ పాన్ లో వేసి అన్ని వైపులా బాగా కాలేదాకా మీడియం మంట మీద పది, పదిహేను నిముషాల పాటు ఫ్రై చేయాలి.
6. ఇలా ఫ్రై చేసుకొన్న ఫిష్ ను సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై రెడీ...



Click it and Unblock the Notifications