Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఖీమా పావ్-ముంబాయ్ స్పెషల్
ముంబాయ్ ఫుడ్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఉదా: పావ్ , ఖీమా పావ్ , ఇది ఒక స్ట్రీట్ ఫుడ్ అక్కడ. ఈ స్ట్రీట్ ఫుడ్ ను మన భారతదేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కువగా తయారుచేస్తారు కాబట్టి, ఇది చాలా ఫేమస్ అయ్యింది. ఈ ముంబాయ్ స్పెషల్ ఖీమా పావ్ ను మనం ఇంట్లోనే తయారు చేసి పిల్లలు ఒక బెస్ట్ ట్రీట్ గా అందివ్వవచ్చు.
ముంబాయ్ లోని బాగా పాపులర్ చెందిన వడ పావ్ లేదా పావ్ బాజీ , పావ్ అనేది చాలా ముఖ్యం. ఈ కాంబినేషన్ లో చాలా రకాల వంటలు తయారు చేసి తింటుంటారు. అందుకే ఈ వంటకానికి కూడా ఖీమా పావ్ ప్రత్యేకం. ఈ వంటకు ఒక ప్రత్యేకమైన బ్రెడ్ (బన్ను)ను ఉపయోగిస్తారు. ఈ వంటకంలో ఖీమా గుజ్జులా ఉంటుంది కానీ, గ్రేవీ కాదు, బ్రెడ్ పావ్ కు సరిపోయేంత పొడిగా ఉంటుంది. మరి ఈ ముంబాయ్ స్పెషల్ ఖీమా పావ్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
పావ్ లేదా బ్రెడ్ బన్ను : 4(ఒక్కో బన్నును రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి)
ఖామా లేదా మటన్ మిన్స్: 500grm
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
టమోటా 1 : (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
ఏలకులు: 4
షాజీరా: 1tsp
లవంగాలు 4
మిరియాలు: 5
బిర్యాని ఆకు: 1
పచ్చిమిరపకాయలు: 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కారం: 1tbsp
గరం మసాలా పొడి: 1tbsp
పావ్ భాజీ మసాలా: 1tbsp
కొత్తిమీర (సన్నగా తరిగి పెట్టుకోవాలి): 2tbsp
బట్టర్(వెన్న): 3tbsp
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో యాలకలు, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు మరియు మిరియాలు వేసి ఫ్రై చేయాలి.
2. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి.
3. రెండు మూడు నిముషాలు ప్రై చేసుకొన్న తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఉప్పు చిలకరించి మరో 5నిముషాలు వేగించడం వల్ల టమోటో త్వరగా వేగుతుంది.
4. వేగుతున్న ఆ మసాల మిశ్రం నుండి పచ్చివాసన వేళ్ళవరకూ వేగించాలి. నూనె పైకి తేలుతూ ఉడకుతుండగా ఖీమాను అందులో వేయాలి.
5. తర్వాత ఈ మిశ్రమాన్నంతటిని బాగా మిక్స్ చేసి మరికొద్ది నిముషాలు ఫ్రై చేయాలి. తర్వాత అందులో కారం, మరియు గరం మసాలా, పావ్ బాజీ మసాలా పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి మరికొంత సేపు ఉడికించుకోవాలి.
6. కొద్దిసేపు ఉడికించిన తర్వాత, రెండు కప్పుల నీరు పోసి మరో పది నిముషాల ఉడికించుకోవాలి.
7. ఖీమా ఫ్రై అవుతూ ఉబ్బతూ వస్తుంది. అప్పుడు మంట ఎక్కువగా పెట్టి మూత పెట్టి మరో 10నిముషాలు వేగించుకోవాలి.
8. ఖీమా బాగా మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి.
9. ఇప్పుడు ఒక పాన్ లో బట్టర్ వేసి కరిగించాలి. పూర్తిగా కరిగించాలి. బట్టర్ బ్రౌన్ గా మారుతుండగా, అప్పుడు పావ్ లేదా బ్రెడ్ బన్నును కరిగే వెన్న మీద సర్దాలి. బట్టర్ లో బ్రెడ్ నాని, టోస్ట్ లా తయారవుతుంది. అంతే ఖీమా పావ్ రెడీ. ఖీమా పావ్ ను స్టఫ్డ్ సాండివిచ్ తో సర్వ్ చేస్తారు.



Click it and Unblock the Notifications