Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
చికెన్ బాల్ నూడిల్స్ విత్ టమోటో సాస్

చికెన్: 1/2kg
తాజా బ్రెడ్ స్లైస్: 25grms
వెల్లుల్లి రెబ్బలు: 2-4(చితగొట్టాలి లేదా తురుము కోవాలి)
ఆలివ్ ఆయిల్: 2tbsp
ఉల్లిపాయ: 1(కట్ చేసుకోవాలి)
క్యారెట్: 1(తురుము)
సోంపు: 1tsp
టమోటో: 3-4tsp
టమోటోగుజ్జు: 1tbsp
నూడిల్స్: 400grms
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మాంసం ఖీమాను, బ్రెడ్ ముక్కలను, సగం వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, కారం వేసి మిక్స్ చేసి వాటిని కొద్దిగా కొద్దిగా చేతిలోనికి తీసుకొని చిన్ని చిన్న బాల్స్ లా చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె కొద్దిగా వేసి వేడయ్యాక, అందులో ఉల్లిపాయలు, క్యారెట్ మరియు మిగిలిన సగభాగం వెల్లుల్లి వేసి వేయించుకోవాలి.
3. అందులో సోంపు వేసి వేసి మరో రెండు నిమిషాల వేయించుకోవాలి. తర్వాత టమోటోను మిక్సీలో వేసి గుజ్జు తయారు చేసుకోవాలి. వేపుడులోనే టమోటో గుజ్జును కూడ చేర్చి తక్కువ మంట మీద పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
4. అంతలోపు నాన్ స్టిక్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ముందుగా తయారు చేసుకొన్న మింట్ బాల్స్ వేడినూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ మీడియం మంట మీద ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి.
5. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని ముందుగా ఉడికించిన నూడిల్స్, తర్వాత దానిమీద మీట్ బాల్, దాని మీద టమోటో-సోంపు సాస్ మిక్స్ ఫ్రై వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications