Latest Updates
-
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది!
‘మెగులాయ్ మటన్ బిర్యాని’ లాగించేద్దామా..!!

తయారీకి కావల్సిన పదార్ధాలు:
- బాసుమతి రైసు (1 కప్పు)
- తాజా మటన్ (1కప్పు)
- 3 మధ్య సైజు ఉల్లిపాయలు
- వెల్లులి రెబ్బలు 6.
- అల్లం తగినంత.
- జీడిపప్పులు.
- పచ్చిమర్చి 6 (సన్నగా తరిగినవి).
- కారం రెండు టేబుల్ స్పూన్లు.
- పెరుగు 1కప్పు.
- కొత్తి మీర (సన్నగా తరిగినది).
- పుదీనా (సన్నగా తరిగినది).
- 1 కప్పు నెయ్యి.
- నీళ్లు ( బియ్యాన్ని ఉడికించేందుకు).
- కుంకుమ పువ్వు 6 రెబ్బలు ( వేయించి, పాలలో నానబెట్టినవి).
- సాల్ట్ తగినంత.
బిర్యానీ తయారీకి కావల్సిన దినుసులు:
- 1 టేబుల్ స్పూప్ జీలకర్ర
- 2 యాలుకులు దంచినవి
- లవంగం మొగ్గలు 3
- దాల్చిన చెక్క
- ఉడకబెట్టిన గుడ్డులు 3,
- వేయించిన బాదాం పప్పులు 10,
తయారీ విధానం:
- ముందుగా ఒక ఉల్లిపాయ, వెల్లులి, అల్లం, జీడిపప్పులను మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- పాన్ పై నెయ్యిను వేడి చేసి అందులో మిగిలిన ఉల్లిపాయలను ముక్కలను వేయించుకుని పక్కనపెట్టుకోండి.
- అదే నెయ్యిలో మటన్ ను వేసి ముక్కులను వేగనిచ్చి వేరుగా పెట్టుకోండి.
- అదే నెయ్యిలో ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం, వెల్లులి పేస్ట్ ను వేయించండి. అవసరమైతే కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు.
- ఈ వేయించిన పేస్ట్ మిశ్రమంలో, ముందుగా వేయించి పెట్టుకున్నమటన్ తో పాటు పెరుగు, తగినంత నీరు, సాల్ట్ ను వేసి 20 నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించండి.
- తయారైన మిశ్రమంలో దంచిపెట్టకున్న దినుసులును కలుపుకోండి.
- మెతుకులు అంటకుండా బియ్యాన్ని ఉడికించి సిద్ధం చేసుకోవాలి.
- అనంతరం బాండీని తీసుకుని కింద భాగంలో కొంత మంసపు మిశ్రమాన్ని వేసి పై భాగంలో ఉడికిన రైస్ ను వేయాలి. ఆ పై పొరలో ఉల్లి, బాదాం పొప్పులు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ విధంగా పొరలను అమర్చుకుంటూ రావాలి.
- ఇలా పొరలను అమర్చుకున్న తరువాత బాండీ పై మూతపెట్టి 30 నిమిషాల పాటు ఉడికించాలి.
- మీరు ఎదురుచూస్తున్న మటన్ బిర్యాని తయార్, సిద్ధంగా ఉంచుకున్న పదార్థాలతో బిర్యానిని అలకంరించి వేడి వేడిగా వడ్డించుకోండి.



Click it and Unblock the Notifications