Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ముర్గ్ కా సాలన్: స్పైసీ చికెన్ కర్రీ
ముర్గ్ కా సాలన్. ఈ వంట బేసిక్ గా నార్త్ వెస్ట్రన్ ప్రదేశంలో చాలా ఫేమస్. ఇంకా పాకిస్తాన్ వారికి అత్యంత ప్రీతికరమైన వంటకం ఇది. ఈ చికెన్ కర్రీ అంత ఫేమస్ అవ్వడానికి కారణం అందులో ఉపయోగించే మసాలా దినుసులే. ఇండియాలో ఈ చికెన్ కర్రీ మొగులై వంటకాల్లో ఇది ఒకటి. ఇది మొగలల రాజు షాజహాన్ యొక్క ఫేవరెట్ డిష్ అందుకే మొగలాయి వంటకాల్లో అత్యంత ప్రసిద్ది చెందింది.
మరి ఇండియన్ చికెన్ కర్రీనీ ఈ పద్దతిలో తయారు చేస్తే నోరూరకుండా ఎలా ఉంటుంది?ఇది ఖచ్చితంగా చాలా టేస్ట్ గా ఉంటుంది. అందుకే ఈ చికెన్ కర్రీనీ రాయల్ రిసిపి అంటుంటారు. ఇండియన్ వంటకాల్లో నాన్ వెజ్ వెరైటీల్లో ముర్గ్ కా సాలన్ చాలా చాలా కారంగా ఉంటుంది.

కావల్సిన పదార్థాలు:
చికెన్: 500grams(మీడియం సైజ్ ముక్కలు)
ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 8(సన్నగా తరుక్కోవాలి)
అల్లం: 1చిన్న ముక్క(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కారం: 1tsp
పసుపు: ½tsp
యాలకులు: 4
మిరియాలు: 5
కొత్తిమీర తరుగు: 2tbps
నూనె: 2tbsp
బట్టర్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. అందులో యాలకులు మరియు మిరియాలు వేసి వేగించుకోవాలి.
2. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఉడికించుకవాలి.
3. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లు ముక్కలు కూడా మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.
4. తర్వాత టమోటో ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసిగి వేగించడం వల్ల అతి త్వరగా వేగుతుంది. ఒక ఐదు నిముషాల పాటు వేగించుకొని స్టౌ ఆఫ్ చేసి వీటన్నింటిని పక్కకు తీసి పెట్టుకోవాలి.
5. ఈ మసాలా దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
6. అంతలోపు పాన్ లో కొద్దిగా బట్టర్ వేసి కరిగించి అందులో చికెన్ ముక్కలు వేసి, బాగా వేగించాలి.
7. చికెన్ ముక్కలు బ్రౌన్ కలర్ లోనికి మారగానే, గ్రైండ్ చేసి పెట్టుకొన్న మసాలా ముద్దను వేసి, మరో 5నిముషాల పాటు మీడియం మంట మీద వేగించుకోవాలి.
8. ఇప్పడు తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి, కలియబెట్టి ఒక కప్పు నీళ్ళు పోసి, మూత పెట్టి మరో 10-15నిముషాల పాటు ఉడికించుకోవాలి. అంతే ముర్గ్ కా సాలన్ చికెన్ కర్రీ రెడీ. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ప్లెయిన్ రైస్, రోటీలకు మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications