ముర్గ్ కాలి మిర్చి: ఇండియన్ పెప్పర్ చికెన్

పెప్పర్ చికెన్ అనగానే చాలా మందికి నోట్లో నీళ్ళు ఊరిపోవాల్సిందే. అంత టెప్ట్ చేస్తుంది ఈ పెప్పర్ చికెన్. అలాంటి పెప్పర్ చికెనే ముర్గ్ కాలి మిర్చి. ఇది దేశీ చికెన్ రిసిపి. చాలా టేస్ట్ గా నోరూరిస్తుంటుంది. ఈ ముర్గ్ కాలి మిర్చి రిసిపికి ప్రత్యేకంగా కాశ్మిరీ చిల్లీపౌడర్ ను ఉపయోగిస్తారు . ఈ చికెన్ కర్రీ రిసిపి ఒక మంచి రుచికిరమైన ఇండియన్ డిష్. ఈ వంటకు వివిధ రకాల ఇండియన్ మసాలా దినుసులు ఉపయోగించడం వల్ల చాలా టేస్ట్ మరియు మంచి ఫ్లేవర్ కలిగి ఉంటుంది.

దేశీవంటలు తయారుచేయడం తెలిసుంటే, ఈ ఇండియన్ పెప్పర్ చికెన్ తయారుచేయడం చాలా సులభం. మరి ఈ టేస్టీ అండ్ ఫ్లేవరబుల్ ఇండియన్ పెప్పర్ చికెన్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Murg Kali Mirch: Indian Pepper Chicken

కావల్సిన పదార్థాలు:
చికెన్ : 1kg
అల్లం వెల్లుల్లి పేస్ట్: 3tbsp
మిరియాలుపొడి : 2tsp
కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్: 1tsp
పసుపు: ½ tsp
పెరుగు: 3tbsp
నిమ్మకాయ రసం: 2tbsp
జీలకర్ర: 2tbsp
ధనియాలు: 1tbsp
పెప్పర్ కార్న్: 1tbsp
పచ్చిమిర్చి: 2(అలాగే ఉండనివ్వాలి) + 4 (తరిగినవి)
ఆవాలు: 1tsp
కొత్తిమీర తరుగు: 3 కాడలు (తరిగినవి)
మస్టర్డ్ ఆయిల్ 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు పద్ధతి:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి, అందులో నిమ్మరసం, పసుపు, పెప్పర్ పౌడర్, అల్లం, వెల్లుల్లి, పెరుగు, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ కనీసం 2గంటల పాటు రిఫ్రిజరేటర్ లో పెట్టాలి.
3. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు మరియు పచ్చిమిర్చి వేసి వేగించాలి.
4. అంతలోపు మిక్సీ జార్ లో జీలకర్ర, ధనియాలు మరియు మిరియాలు వేసి రఫ్ గా పొడి చేసుకోవాలి.
5. తర్వాత ఈ పొడిని 2-3 మిర్చి వేగుతున్న పాన్ లో వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులో చికెన్ ముక్కలు కూడా వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగిలిన మ్యారినేట్ మసాలాను కూడా వేసి బాగామిక్స్ చేయాలి.
7. ఇలా మిక్స్ చేసి చికెన్ రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి మిక్స్ చేసి మూత పెట్టి 12నుండి 15నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అవసరం అయితే 2కప్పుల నీళ్ళు పోసి చిక్కగా ఉడికించుకోవాలి.
8. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు మరియు పచ్చిమిర్చి గార్నిష్ చేసి, స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ముర్గ్ కాలి మిర్చి రెడీ. ఇది రోటీ మరియ పరోటాలకు చాలా టేస్ట్ గా ఉంటుంది.

Story first published: Monday, June 23, 2014, 18:08 [IST]
Desktop Bottom Promotion