Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మటన్ ఖీమా కట్ లెట్
కట్ లెట్ రిసిపిలు సాధారణంగా ఈవెనింగ్ టైమ్స్ లో ఎక్కువగా తయారు చేసుకుంటారు. ముఖ్యంగా ఈవెనింగ్ స్నాక్స్ గా వీటిని తయారు చేసుకోవచ్చు. కట్ లెట్ చాలా రుచిగా మరియు క్రిస్పీగా ఉంటాయి. ఈ కట్ లెట్ ను కొంచెం వెరైటీగా మటన్ కు ఎగ్ చేర్చి అద్భుతంగా తయారు చేయవచ్చు. ఈ కట్ లెట్ రిసిపి చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు.
మటన్ ఖీమా కట్ లెట్స్ చాలా రకాలున్నాయి . ఈ మటన్ ఖీమా కట్ లెట్ కోల్ కత్తా స్పెషల్ రిసిపి. ఈ కట్ లెట్ యొక్క స్పెషాలిటీ ఎగ్ తో ఫ్రై చేయడమే... ఈ రంజాన్ స్పెషల్ ఖీమా ఎగ్ కట్ లెట్స్ అద్భుతమైన టేస్ట్ ను అంధిస్తుంది. ఇది కడుపు నిండుగా ఉంచే ఫిల్లింగ్ డిష్. మీరు ఈ మటన్ ఖీమా ఎగ్ ఫ్రైడ్ కట్ లెట్ ను జస్ట్ 20నిముషాల్లో తయారు చేయవచ్చు . మరి నోరూరించే ఈ స్పెషల్ స్నాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
మటన్ ఖీమా -500grms
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
నిమ్మరసం: 1tbsp
పచ్చిమిర్చి: 4 (చిన్న ముక్కలుగా తరిగినవి)
కొత్తిమీర తరుగు: 1tsp(సన్నగా తరిగినవి)
పెప్పర్ పౌడర్: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
శెనగపిండి-2tbsp
గుడ్లు -4
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 4tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం,వెల్లుల్లి పేస్ట్ , నిమ్మరసం, మరియు ఉప్పు, మటన్ ఖీమా అన్నింటిని వేయాలి.
2. అలాగే, పెప్పర్ పౌడర్, మరియు గరం మసాలా పౌడర్ బాగా మిక్స్ చేసి 10-15నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అందులో కొద్దిగా శెనగపిండి కకూడా వేసి బాగా మిక్స్ చేయాలి. మెత్తగా కలుపుకోవాలి.
4. తర్వాత చేతినిండుగా పిడికెడు ఖీమా మిశ్రమాన్ని తీసుకొని గుండ్రంగా చేసి అరచేతిలో పెట్టి వడలాగే తట్టుకోవాలి.
5. ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
6. నూనె వేడయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని కోడిగుడ్లను పగులగొట్టి అందులో పోసి, ఉప్పు చిలకరించి బాగా గిలకొట్టి పెట్టుకోవాలి.
7. ఇప్పుడు ఖీమా కట్ లెట్ ను బీట్ చేసి పెట్టుకొన్న ఎగ్ లో డిప్ చేసి కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
8. మంటను మీడియంగా పెట్టి ఎగ్ ఖీమా కట్ లెట్ డీప్ ఫ్రై చేస్తూ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి . రెండు వైపులు డీప్ ప్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోని తీసుకోవాలి . అంతే మటన్ ఖీమా కట్ లెట్ ఫ్రైడ్ విత్ ఎగ్ రెడీ.



Click it and Unblock the Notifications