Latest Updates
-
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది!
మటన్ లివర్ ‘ఫ్రై’..!!

మటన్ లివర్ 'ఫ్రై'.. తయారీకి కావల్సిన పదార్థాలు:
- మటన్ 300 గ్రాములు ( మీడియం సైజు ముక్కలు),
- పాలు 1 మగ్,
- బంగాళదుంపలు 2 ( చిన్న చిన్న ముక్కులుగా తరిగినవి),
- ఉల్లిపాయలు 2 ( సన్నగా తరిగినవి),
- వెల్లులి రెబ్బలు 6 (సన్నగా తరిగినవి),
- టమోటో 1 (సన్నగా తరిగనది),
- పచ్చిమిర్చి 4 (సన్నగా తరగినవి),
- కారం 1 టేబుల్ స్పూన్,
- జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్,
- ధనియాల పొడి 1టేబుల్ స్పూన్,
- పలావ్ ఆకు 1,
- జీలకర్ర 1 టేబుల్ స్పూన్,
- మటన్ గరమ్ మసాలా (1 టేబుల్ స్పూన్),
- కొత్తిమీర (సన్నగా తరిగినది),
- నూనె 2 టేబుల్ స్పూన్లు,
- సాల్ట్ తగినంత.
తయారీ విధానం:
- ముందుగా మటన్ లివర్ ముక్కలను పాలలో గంట సేపు నానబెట్టుకోవాలి.
- బాండీ పై వేడిచేసుకున్న నూనెలో గరమ్ మసాలా, పలావ్ ఆకు, జీలకర్రల మిశ్రమాన్ని వేసి వేయించాలి.
- ఆ తురువాత తరిగిన ఉల్లిముక్కలను వేని బంగారు రంగులో వేగిన తరువాత నానబెట్టకున్న లివర్ ముక్కలను వేసి 2 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి.
- ఉడికుతున్న మిశ్రమంలో అల్లం, వెల్లులి ముక్కలను జోడించి మరో నిమిషం పాటు ఉడికించుకోవాలి.
- అనంతరం తరగి పెట్టకున్న టమోటో ముక్కలతో పాటు పచ్చిమిర్చి తగినంత సాల్ట్ ను జోడించి గ్రేవీ వచ్చంత వరకు అంటే 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- తరవాత ఉడుకుతున్న 'లివర్ ఫ్రై'లో కారం, ధనియాల పొడిని చల్లాలి, ఇలా 4 నిమిషాల పాటు ఉడికించిన తరువాత 3 టేబుల్ స్పూన్ల నీటిని పోసి బాండీ పై మూత పెట్టేయండి. 5 నిమిషాల తరువాత తెరిచి చూస్తే మీ మటన్ లివర్ ఫ్రై తయారైనట్లే..
- వేడి వేడిగా తయారైన మటన్ లివర్ 'ఫ్రై'ని రైస్, రొట్టె వంటి పదార్థంలో నంచుకుని తింటే ఆమోఘం.



Click it and Unblock the Notifications