Latest Updates
-
ఆదివారం బ్రేక్ ఫాస్ట్ అదిరిపోవాలా? వేడి వేడి ఇడ్లీలోకి కేరళ మటన్ పెప్పర్ ఫ్రై..ఈజీగా ఎలా చేయాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయా? అయితే ఈ నోరూరించే మ్యాంగో ఫలూదాతో కూల్ కూల్ అయిపోండి! -
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త డేంజర్.. కేఫ్‌కు వెళ్తే లక్షల్లో బిల్లు, జాగ్రత్త! -
తింటే స్వర్గమే అనిపించేంత రుచి..కేవలం 10 నిమిషాల్లో చేసుకునే టమాటో రైస్..ఇలా చేసుకోండి -
ఎండల తీవ్రతతో మహిళల ఆరోగ్యంపై ప్రభావం… గర్భిణులు ఈ జాగ్రత్తలు అస్సలు మిస్ అవ్వకండి! -
ఐరన్, ఫైబర్ పుష్కలం.. ఆరోగ్యానికి అమృతం ఈ పాలకూర రోటీ..ఎలా చేసుకోవాలంటే.. -
మదర్స్ డే రోజున అత్తమామల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
అమ్మని మించిన దైవం లేదు..ఈ మదర్స్ డేకి మీ అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పించే విషెస్ ఇవే.. -
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ!
ఆయిల్ లెస్ జీర చికెన్ ఫ్రై

చికెన్: 1/2kg
ఎండుకొబ్బరి తురుము: 2tbsp
జీలకర్ర: 2tbsp
చెక్క: చిన్న ముక్క
లవంగం: 4-6
వెల్లు రెబ్బలు: 8-10
అల్లం: చిన్నముక్క
ఉల్లిపాయ: 2-3
మిరియాలు: 4-5గింజలు
పసుపు: 1/4tsp
కారం: 1tbsp
కొత్తిమీర తురుము: 1/2tbsp
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ మంచినీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీలో ఎండు కొబ్బరి, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగం, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
3. ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలి. తర్వాత స్టౌపై సాన్ పెట్టి కొద్దిగా ఆయిన్ వేసి(ముక్కలు పాన్ కు అంటుకోకుండా ఉండేందుకు)వేడయ్యాక చికెన్ ముక్కలు అందులో వేసి సన్నని మంటపై బాగా వేగనివ్వాలి.
4. పది నిమిషాలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు కూడా అందులో వేసి మరో ఐదు నిమిషాల పాటు వేయించాలి.
5. ఇప్పుడు అందులో పేస్ట్ చేసు పెట్టుకొన్న జీర మిశ్రమాన్ని వేసి బాగా కలుపుతూ, పసుపు, కారం, వేసి తక్కువ మంటలో ఉడికించాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు.
6. మరో పదినిమిషాల పాటు ఉడకబెట్టి దించేముందు కొత్తి మీర ఆ మిశ్రమంలో వేసి దించాలి. ఇప్పుడు ఆయిల్ లెస్ జీర చికెన్ ఫ్రై రెడీ..



Click it and Unblock the Notifications