Latest Updates
-
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది! -
గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన యోగంతో జాక్ పాట్!
నోరూరించే పెప్పర్ మటన్

కావలసిన పదార్థాలు:
మటన్: 500grms
పెరుగు: 100grm
పెప్పర్ పొడి: 4tbsp
పచ్చిమిర్చి: 3
ఉల్లిపాయలు: 3
వెల్లుల్లి: 15రెబ్బలు
అల్లం: కొద్దిగా
జీలకర్ర: 1tsp
జీలకర్ర పొడి: 2tbsp
మిరియాలు: 10గింజలు
యాలకలు: 4
లవంగం: 5
చెక్క: 3 పీసులు
బిర్యాని ఆకు: 2
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. మొదటగా ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సర్ లో వేసి పేస్ట్ చేసుకోవాలి. 2. శుభ్రం చేసుకొన్న మటన్ పీసులకు ఈ పేస్ట్, మిరియాలు, మరియు పెరుగు, వేపి బాగా కలిపి ఒక గంటపాటు పక్కనపెట్టుకోవాలి.
3. ఒక గంట తర్వాత పాన్ లో తగినంత నూనె వేసి వేడి అయ్యాక అందులో బిర్యాని ఆకు, జీలకర్ర, చెక్క, మిరియాలు, లవంగాలు మరియు యాలకులు వేసి వేయించాలి.
4. అందులోనే ముందుగా తయారు చేసిపెట్టుకొన్న మటన్ మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసి 10నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి.
5. తర్వాత అందులో జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో 10నిమిషాల పాటు ఉడకబెట్టాలి.
6. ఇప్పుడు చిక్కగా సంగం ఉడికిన(హాఫ్ బాయిల్) గ్రేవినీ తీసుకొని ప్రెషర్ కుక్కర్ లో వేసి తగినంత నీళ్ళు పోసి 3-4విసిల్స్ వరకు స్టౌ మీద పెట్టి ఉడికించాలి. అంతే మెత్తగా ఉడికిన రుచికరమై మటన్ పెప్పర్ రెడీ.



Click it and Unblock the Notifications