Latest Updates
-
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
ప్రాన్స్ (రొయ్యలు): కొబ్బరి పాల పులావ్
సాధారణంగా ఇంట్లో ఎప్పుడూ చేసినవే చేసి బోరుకొడుతుంటే, కొంచెం వెరైటీగా కోరుకుంటాం. కానీ వాటిని సరైన పద్దతిలో తయారుచేయడం తెలియదు. కొత్త వంటలు చేసేటప్పుడు, కాస్త ఓపిక, ఈ వంట మీద అవగాహన, అందుకు కావల్సిన వస్తువులన్నీ ఉన్నాయలో లేదో తెలుసుకొని, అన్ని సిద్దం చేసుకొన్న తర్వాత కొత్తగా వంట తయారుచేయడానికి ప్రయత్నించాలి. కొన్ని రైస్ రిసిపిలు తయారుచేయడం చాలా సులభం, మరియు తేలికైన పని కూడా. పులావ్ వివిధ రకాలుగా తయారుచేస్తుంటారు. వాటిలో ప్రాన్స్ (రొయ్యల)పులావ్ అందరి టేస్ట్ బడ్స్ కు రుచిచూపించాల్సిందే.
చాలా మందికి రొయ్యల ఫ్రై మాత్రమే తెలుసు, కానీ రొయ్యల గ్రేవీ, రొయ్యల బిర్యానీ, రొయ్యల పులావ్ కూడా తయారుచేసుకుంటారు. ఇవి తినడానికి రుచికరంగా మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా. ఈ సీ ఫుడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తాయి. ఇది మంచి ఫ్లేవర్ తో పాటు, మంచి రుచిని కూడా కలిగి ఉంటాయి. సీఫుడ్స్ ఇష్టపడే వారు ఇలా వైరటీ వంటలు తయారుచేసుకొనే రుచి చూడవచ్చు.

కావలసిన పదార్థాలు
రొయ్యలు : 1kg
పలావు బియ్యం : 1kg
అల్లం, వెల్లుల్లి: 1tsp
లవంగాలు: 2
యాలకులు: 2
బిర్యానీ ఆకు: 1
చెక్క: చిన్న ముక్క
ఉల్లిపాయలు : 4(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
టమాటలు : 4(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చి మిరపకాయలు : 5(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కారం : 1tbsp
నెయ్యి : 1cup
నూనె : తగినంత
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర : తగినంత
గరంమసాలా : 1tsp
పసుపు: 1/4tsp
కొబ్బరి పాలు : 6glasses
ఉప్పు : రుచికి తగినంత
తయారుచేయు విధానం
1. ముందుగా ఒక పాత్రలో నూనె పోసి కాస్త వేడి అయ్యాక అందులో రొయ్యలు వేసి, వేగించాలి.
2. తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి కొత్తిమీర, కరివేపాకు వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
3. చివరగా టమాట ముక్కలు కూడా వేసి కాసేపు వేగించి, టమోటో ముక్కలు బాగా మెత్తబడ్డాక దింపి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మరొక పాత్రలో నెయ్యి వేసి బాగా వేడి అయ్యాక అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క, ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి.తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, పచ్చివాసన పోయే వరకూ వేగించుకోవాలి.
5. అందులోనే పచ్చి మిర్చి, పసుపు వేయాలి. తరువాత తగినన్ని ఆరుగ్లాసుల పాలు పోసి, అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కూడా మిక్స్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసి అందులో పలావు బియ్యం వేయాలి. అన్నం ఉడకుతుండగా ముందుగా తయారుచేసి పెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. అంతే.. రొయ్యల పలావు రెడీ.



Click it and Unblock the Notifications