Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
ప్రాన్స్ మంచూరియన్
సాధారణంగా మంచూరియ అంటేనే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే. మంచూరియన్ రంగు, రుచి మనుష్యలు టెప్ట్ చేస్తుంది. త్వరగా తినేయాలనిపిస్తుంది. అయితే మంచూరియన్ చాలా రకాలుగా తయారు చేస్తుంటారు.
గోబి మంచూరియన్, చికెన్ మంచూరియన్, ఇంకా చాలా వెరైటీలు. అలాగే ఫ్రాన్స్ మంచూరియన్ కూడా. ఇది చైనీయుల స్పెషల్ రిసిపి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మన ఇండియన్ స్టైల్లో ప్రాన్స్(రొయ్యల)మంచూరియన్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు
ప్రాన్స్: 250grms
అజినమోటో: 1tsp
ఉప్పు : రుచికి తగినంత
మిరియాల పొడి : 2tsp
కోడిగుడ్డు : 1
కార్న్‌ఫ్లోర్ : 1/2cup
మైదాపిండి : 1/2cup
నూనె : డీప్ ఫ్రైకి సరిపడా
పచ్చిమిర్చి తరుగు: 2tbsp
అల్లంవెల్లుల్లి తరుగు : 4tsp
పసుపు : చిటికెడు
కారం : 1tsp
కొత్తిమీర : కట్ట (సన్నగా తరగాలి)
తయారు చేయు విధానం:
1. ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో ఒక మోస్తరుగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నెలో అర టీ స్పూన్ అజినమోటో, ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి, కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగాకలుపుకోవాలి.
3. ఆ మిశ్రమంలో ఉడికించిన ప్రాన్స్ వేసి కలపాలి. పాన్ లో నూనె పోసి వేడయ్యాక కలిపిపెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి. 4. ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకుని పావు కప్పు నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి తరుగు, అర టీ స్పూన్ అజినమోటో, అర టీ స్పూన్ మిరియాలపొడి, ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేయించాలి.
5. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ప్రాన్స్ పకోడీని కూడా కలిపి తక్కువ సెగ మీద అయిదారు నిమిషాలు తిప్పి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ప్రాన్స్ మంచూరియా రెడీ...



Click it and Unblock the Notifications











