Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రంజాన్ స్పెషల్ మటన్ ఫ్రై
ఇండియన్ హాట్ అండ్ స్పైసీ ఫుడ్ తినకుండా ఉండలేరు. ముఖ్యంగా స్పైసీగా ఉండే నాన్ వెజ్ ఫుడ్ ను తినకుండా ఏ మాత్రం రాజీ పడరు. నాన్ వెజిటేరియన్స్, చికెన్, మటన్ కు, ఫిష్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చల్లని వాతావరణంలో నాన్ వెజ్ వంటల మీద ఎక్కువ ఇష్టపడుతారు. అయితే మటన్ ను చాలా తక్కువ వెరైటీలు కలిగి ఉంటాయి. మటన్ ఫ్రై అందరికీ తెలిసినటువంటి ఒక పాపులర్ వంట.
ముఖ్యంగా రంజాన్ మాసంలో ముస్లీములు తయారుచేసే మటన్ ఫ్రై చాలా టేస్టీగా నోరూరిస్తుంటుంది. ఒకసారి ఈ మటన్ ఫ్రైని తింటే మాత్రం, ఆ టేస్ట్ ను ఎప్పటికీ విడవరు. స్పైసీగా మరియు టేస్టీ గా ఉండే మటన్ ఫ్రైను కొన్ని ఇండియన్ మసాలా దినుసులను ఉపయోగించి మౌత్ వాటరింగ్ టేస్ట్ తో తయారుచేస్తారు. మరి మీరు కూడా ఈ స్పైసీ నాన్ వెజిటేరియన్ డిష్ రుచి చూడాలంటే, తయారుచేసే విధానం తెలుసుకోవాల్సిందే...

కావలసిన పదార్దాలు:
బోన్‌లెస్ మటన్ : 500grms
తరిగిన ఉల్లిపాయలు : 1cup
కారం : 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
పసుపు : 1/4tsp
అల్లం వెల్లల్లి పేస్టు : 2tbsp
బఘార్ కోసం కావలసినవి:
నూనె : 2tbsp
జీలకర్ర : 1tsp
కరివేపాకు కొత్తిమీర పుదీనా
పచ్చిమిర్చి : 4
మిరియాల పొడి : 1/2tsp
గరం మసాల పౌడర్ : 1/2tsp
నిమ్మరసం : 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఓ పాత్రలోకి మాంసం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపులను వేసి బాగా కలిపి సరపడా నీటిని పోసి ప్రెజర్ కుక్కర్‌లో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి మాంసం ముక్కలను తడి ఆరే వరకూ పక్కకు పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టౌ వెలిగించి దానిపై పాన్ పెట్టి అందులో సరిపడా నూనె వేసి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి(మధ్యలో కత్తిరించినవి)లను వేసి ఒక రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులోకి పక్కన పెట్టుకున్న మాంసంను కూడా వేసి బాగా కలియబెట్టాలి.
4. ఈ మిశ్రమం మొత్తం ఫ్రై అవుతుండా, అందులోనే మిరియాల పొడి, గరం మసాల పొడి నిమ్మరసం వేసి బాగా కలిపి మరో 5నుండి 10 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. ముక్కలు బాగా వేగాయని నిర్ధారించుకున్నాక దించేసుకోవాలి. అంతే రంజాన్ స్పెషల్ మటన్ ఫ్రై రెడీ



Click it and Unblock the Notifications